AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఖాళీ కడుపుతో ఈ 9 పనులు అస్సలు చేయకండి.. ఆరోగ్యం జాగ్రత్త!

ఆరోగ్యకరమైన జీవనశైలికి సరైన ఆహార నియమాలు ఎంత ముఖ్యమో, ఏ సమయంలో ఏ పని చేయాలనేది కూడా అంతే ముఖ్యం. చాలామంది ఉదయం లేవగానే లేదా ఎక్కువ సమయం ఆకలితో ఉన్నప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ఖాళీ కడుపుతో కొన్ని రకాల పనులు చేయడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పరగడుపున అస్సలు చేయకూడని ఆ 9 పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఖాళీ కడుపుతో ఈ 9 పనులు అస్సలు చేయకండి.. ఆరోగ్యం జాగ్రత్త!
Empty Stomach MistakesImage Credit source: tv9 telugu
Jyothi Gadda
|

Updated on: Jun 10, 2026 | 7:17 AM

Share

ఉదయం నిద్రలేచిన వెంటనే లేదా ఎక్కువ సమయం ఆకలితో ఉన్నప్పుడు ఖాళీ కడుపుతో కొన్ని పనులు చేయడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు.. లంచ్ లేదా బ్రేక్‌ఫాస్ట్‌కు ముందు ఏం తింటున్నాం, ఏం చేస్తున్నామనే విషయంలో జాగ్రత్త అవసరమని చెబుతున్నారు. మన రోజూ వారి జీవనశైలిలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చునని చెబుతున్నారు. అదేలాగో ఇప్పుడు చూద్దాం..

కాఫీ లేదా టీ తాగడం: ఉదయాన్నే ఖాళీ కడుపుతో బెడ్ టీ లేదా కాఫీ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. కానీ, ఇది కడుపులో యాసిడ్ ఉత్పత్తిని పెంచుతుంది. దీనివల్ల జీర్ణక్రియ దెబ్బతినడమే కాకుండా గుండెల్లో మంట, గ్యాస్ సమస్యలు తలెత్తుతాయి.

పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం: కడుపులో ఆహారం లేకుండా పారాసిటమాల్, ఆస్పిరిన్ వంటి నొప్పి నివారణ మాత్రలు వేసుకోవడం వల్ల కడుపు లోపలి పొర దెబ్బతింటుంది. ఇది గ్యాస్ట్రిక్ బ్లీడింగ్, అల్సర్లకు దారితీస్తుంది.

ఇవి కూడా చదవండి

తీవ్రమైన వ్యాయామం (Intense Workout): కడుపు ఖాళీగా ఉన్నప్పుడు శరీరంలో గ్లైకోజెన్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. ఈ సమయంలో కఠినమైన వర్కవుట్లు చేయడం వల్ల కండరాల క్షీణత, నీరసం, కళ్ళు తిరగడం వంటి సమస్యలు వస్తాయి.

చూయింగ్ గమ్ నమలడం: ఖాళీ కడుపుతో చూయింగ్ గమ్ నమలడం వల్ల మెదడు కడుపులోకి ఆహారం వస్తోందని భావించి, జీర్ణ రసాలను (Acids) విడుదల చేస్తుంది. ఆహారం లేకపోవడంతో ఈ యాసిడ్ కడుపు గోడలను దెబ్బతీసి అల్సర్లకు కారణమవుతుంది.

ఆల్కహాల్ సేవించడం: ఖాళీ కడుపుతో మద్యం తాగితే, అది నేరుగా రక్తప్రవాహంలోకి వేగంగా కలిసిపోతుంది. ఇది కాలేయం, గుండె, కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

నిమ్మ లేదా పుల్లటి పండ్లు తినడం: సిట్రస్ జాతికి చెందిన పండ్లలో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని పరగడుపున తీసుకోవడం వల్ల కడుపులో మంట, ఎసిడిటీ పెరుగుతాయి.

గొడవలు లేదా వాదనలు పెట్టుకోవడం: కడుపు ఖాళీగా ఉన్నప్పుడు శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. దీనివల్ల మెదడు త్వరగా కోపానికి గురవుతుంది. కాబట్టి ఆకలితో ఉన్నప్పుడు ముఖ్యమైన నిర్ణయాలు, వాదనలకు దూరంగా ఉండాలి.

కార్బోనేటేడ్ డ్రింక్స్ తాగడం: సోడా లేదా కూల్ డ్రింక్స్ ఖాళీ కడుపుతో తాగడం వల్ల జీర్ణవ్యవస్థ నెమ్మదిస్తుంది. కడుపు ఉబ్బరం సమస్య వస్తుంది.

షాపింగ్‌కు వెళ్లడం: ఆకలితో ఉన్నప్పుడు షాపింగ్‌కు వెళ్తే, అవసరం లేని జంక్ ఫుడ్స్ లేదా ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని కొనుగోలు చేసే అవకాశం పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఉదయాన్నే గోరువెచ్చని నీరు లేదా నానబెట్టిన బాదం వంటి తేలికపాటి ఆహారంతో రోజును ప్రారంభించడం ఎంతో మంచిది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఖాళీ కడుపుతో ఈ 9 పనులు అస్సలు చేయకండి.. ఆరోగ్యం జాగ్రత్త!
ఖాళీ కడుపుతో ఈ 9 పనులు అస్సలు చేయకండి.. ఆరోగ్యం జాగ్రత్త!
చెక్ బౌన్స్‌ కేసు నిజంగా జైలు శిక్షకు దారితీస్తుందా? రూల్స్ ఏంటి?
చెక్ బౌన్స్‌ కేసు నిజంగా జైలు శిక్షకు దారితీస్తుందా? రూల్స్ ఏంటి?
జోరు వానలో తడిచిన వాళ్ళు ఇవి రెండు గారెలు తింటే నీరసం పోయి..
జోరు వానలో తడిచిన వాళ్ళు ఇవి రెండు గారెలు తింటే నీరసం పోయి..
తల్లిదండ్రులు అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన విషయం ఇది..
తల్లిదండ్రులు అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన విషయం ఇది..
దుమ్మురేపిన తిలక్ సేన.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరంటే..?
దుమ్మురేపిన తిలక్ సేన.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరంటే..?
'సమరసింహారెడ్డి'లోని ఆ డైలాగులు పరిటాల రవి మాటలే: పరుచూరి
'సమరసింహారెడ్డి'లోని ఆ డైలాగులు పరిటాల రవి మాటలే: పరుచూరి
ఉదయాన్నే నీళ్లు ఎప్పుడు తాగాలి? బ్రష్ చేయడానికి ముందా.. తర్వాతనా?
ఉదయాన్నే నీళ్లు ఎప్పుడు తాగాలి? బ్రష్ చేయడానికి ముందా.. తర్వాతనా?
విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..
విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..
వర్షాకాలంలో గొంతు నొప్పి బాధలు.. గరగరను చిటికెలో తగ్గించే..
వర్షాకాలంలో గొంతు నొప్పి బాధలు.. గరగరను చిటికెలో తగ్గించే..
భారీగా దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో ఎంత?
భారీగా దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో ఎంత?