రాజ్యసభలో ఎన్డీయే ‘చీర్స్’! కాంగ్రెస్ పార్టీ డీలా !

రాజ్యసభలో పాలక ఎన్డీయే తన బలం పెంచుకుంది. కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ పురి సహా 9 మంది బీజేపీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో సభ్యుల సంఖ్య 100 దాటిపోయింది.

  • Umakanth Rao
  • Publish Date - 10:05 am, Tue, 3 November 20
రాజ్యసభలో ఎన్డీయే 'చీర్స్'! కాంగ్రెస్ పార్టీ  డీలా !

రాజ్యసభలో పాలక ఎన్డీయే తన బలం పెంచుకుంది. కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ పురి సహా 9 మంది బీజేపీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో సభ్యుల సంఖ్య 100 దాటిపోయింది. చాలాకాలం వరకు ఎగువ సభలో పటిష్టంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ‘నీరు గారిపోయింది’. సభలో ఈ పార్టీ మెంబర్స్  సంఖ్య 38 కి తగ్గిపోయింది. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ మరో రెండు సీట్లను కోల్పోయింది. 11 స్థానాలకు గాను యూపీ నుంచి 10, ఉత్తరాఖండ్ నుంచి 1, బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో కమలం పార్టీ 92 స్థానాలను కైవసం చేసుకోగలిగింది. ముగ్గురు మళ్ళీ ఎన్నిక కాగా-జేడీ-యూ నుంచి అయిదుగురు కూడా ఎన్నిక కావడంతో సభలో ఈ పార్టీ సభ్యుల సంఖ్య 104 కి పెరిగింది. నలుగురు నామినేటెడ్ సభ్యులు కూడా ఎన్డీయేకి బాసటగా ఉన్నారు. ఇక అన్నాడీఎంకే, బీజేడీ, టీఆర్ఎస్, వైసీపీ వంటి మిత్రపక్షాల మద్దతు కూడా బీజేపీకి ఉంది.