షారూక్‌కి ‘బూర్జ్‌ ఖలీఫా’ స్పెషల్‌ విషెస్‌.. దగ్గరుండి వీక్షించిన కింగ్‌ఖాన్‌

బాలీవుడ్‌ కింగ్‌ఖాన్ షారూక్‌ ఖాన్ సోమవారం 55వ పుట్టినరోజును జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఆయనకు విషెస్ చెప్పారు.

షారూక్‌కి 'బూర్జ్‌ ఖలీఫా' స్పెషల్‌ విషెస్‌.. దగ్గరుండి వీక్షించిన కింగ్‌ఖాన్‌
Follow us

| Edited By:

Updated on: Nov 03, 2020 | 9:17 AM

Shah Rukh Khan: బాలీవుడ్‌ కింగ్‌ఖాన్ షారూక్‌ ఖాన్ సోమవారం 55వ పుట్టినరోజును జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఆయనకు విషెస్ చెప్పారు. కాగా షారూక్ బర్త్‌డే సందర్భంగా దుబాయ్‌లోని ప్రముఖ బూర్జ్ ఖలీఫా ఆయనకు విషెస్ చెప్పింది. షారూక్ ఫొటోలతో కింగ్ ఆఫ్ బాలీవుడ్‌, హ్యాపీ బర్త్‌డే షారూక్ ఖాన్ అంటూ బాద్‌షాపై ప్రత్యేక ప్రేమను చాటారు. గతేడాది కూడా బూర్జ్‌ ఖలీఫా షారూక్‌కి ఇలాంటి ట్రిబ్యూనే ఇవ్వగా.. ఈసారి ఆ ట్రిబ్యూట్‌ని దగ్గరుండి వీక్షించారు కింగ్‌ఖాన్‌. ( కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1,536 కొత్త కేసులు.. మూడు మరణాలు)

ఈ సందర్భంగా అక్కడ తీసుకున్న ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన షారూక్‌.. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన స్క్రీన్‌పై నన్ను చూసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నా తదుపరి సినిమా స్క్రీన్‌ మీద రాకముందే మొహమ్మద్ అలబ్బర్ నన్ను స్క్రీన్‌పై చూపించారు. థ్యాంక్యు అండ్ లవ్యూ. నా పిల్లలు దీన్ని చూసి ఎంతో ఇంప్రైస్ అయ్యారు అని పెట్టారు. ( Bigg Boss 4: బిగ్‌బాస్‌కి మోనాల్‌ రిక్వెస్ట్‌)