సొంతరాష్ట్ర పర్యటనలో మోదీ జోరు

ప్రధాని నరేంద్రమోదీ సొంతరాష్ట్రం గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. కొవిడ్‌ విజృంభణ తర్వాత తొలిసారిగా సొంత రాష్ట్రానికి వెళ్లిన మోదీ, అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ ప్రాంతంలో 17 ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నారు. తొలుత నర్మదా జిల్లా కేవడియా గ్రామానికి చేరుకున్న ప్రధాని మోదీ…ఐక్యత విగ్రహం సమీపంలో 17 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఆరోగ్య వనాన్ని ప్రారంభించారు. గోల్ఫ్‌ కార్ట్‌లో ప్రయాణించి ఆరోగ్య వనం అందాలను వీక్షించారు. అనంతరం చిల్డ్రన్‌ న్యూట్రిషన్‌ పార్క్‌ను […]

సొంతరాష్ట్ర పర్యటనలో మోదీ జోరు
Follow us

|

Updated on: Oct 31, 2020 | 7:29 AM

ప్రధాని నరేంద్రమోదీ సొంతరాష్ట్రం గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. కొవిడ్‌ విజృంభణ తర్వాత తొలిసారిగా సొంత రాష్ట్రానికి వెళ్లిన మోదీ, అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ ప్రాంతంలో 17 ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నారు. తొలుత నర్మదా జిల్లా కేవడియా గ్రామానికి చేరుకున్న ప్రధాని మోదీ…ఐక్యత విగ్రహం సమీపంలో 17 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఆరోగ్య వనాన్ని ప్రారంభించారు. గోల్ఫ్‌ కార్ట్‌లో ప్రయాణించి ఆరోగ్య వనం అందాలను వీక్షించారు. అనంతరం చిల్డ్రన్‌ న్యూట్రిషన్‌ పార్క్‌ను ప్రారంభించి.. అక్కడి న్యూట్రీ ట్రైన్‌లో కాసేపు సరదాగా ప్రయాణించారు. భారత సంస్కృతి సంప్రదాయాలు, చేనేత కళలకు అద్దం పట్టే ఏక్తా మాల్‌ను ప్రారంభించి అక్కడి కళాకృతులను వీక్షించారు. నర్మదా నదిలో క్రూయిజ్‌ పడవలో వివహరించారు. సర్ధార్‌ పటేల్‌ విగ్రహాన్ని సందర్శించారు. రాత్రి పున్నమి వెన్నెలలో ఆయన నర్మదా నది అందాలను వీక్షించారు. అక్కడ ఏర్పాటు చేసిన లైటింగ్‌ షోను తిలకించారు. కేవాడియాను దేశంలో ప్రసిద్ద పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికను సిద్దం చేసింది గుజరాత్ ప్రభుత్వం. కెవాడియాలో సఫారీ పార్క్‌ను కూడా ప్రారంభించారు మోదీ. అభయారణ్యం అంతా కలియతిరిగారు. అరుదైన జంతువులు , పక్షులకు ఈ పార్క్‌ నిలయం… ఒకప్పుడు డంపింగ్‌యార్డ్‌గా ఉన్న ప్రాంతాన్ని కెవాడియాలో పార్క్‌గా తీర్చిదిద్దారు. ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రపంచస్థాయిలో కెవాడియాను టూరిస్ట్‌ స్పాట్‌గా అభివృద్ది చేశారు. ప్రపంచం నలుమూలల నుంచి తెప్పించిన పూల మొక్కలను ఇక్కడ నాటారు పూలవనంగా తీర్చిదిద్దారు. పార్క్‌లో పులులను , చిరుతలను చూస్తూ సరదాగా గడిపారు మోదీ. క్రూరమృగాలను అతిసమీపం నుంచి చూసే అవకాశం ఈ సఫారీలో ఉండడం ఇంకో ప్రత్యేకత. రామచిలుకలను , పావురాలకు స్వేచ్ఛ కల్పించారు మోదీ. వాటిని గాలి లోకి వదిలారు. పార్క్‌లో రామచిలుకలను చూసి ఆనందపడ్డారు మోదీ. ఇవాళ కేవడియా-అహ్మదాబాద్‌ మధ్య సీప్లెయిన్‌ సేవలను ఇవాళ మోదీ ప్రారంభిస్తారు.