Nani ‘V’ Movie Review: ఓటీటీ బ్లాక్‌బస్టర్‌.. నాని ‘వి’ బొమ్మ దద్దరిలింది..!

నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన చిత్రం 'వి'. ఈ మూవీలో మొదటిసారి నాని నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడు.

Nani 'V' Movie Review: ఓటీటీ బ్లాక్‌బస్టర్‌.. నాని 'వి' బొమ్మ దద్దరిలింది..!
Follow us

|

Updated on: Sep 05, 2020 | 10:26 AM

టైటిల్ : ‘వి’

తారాగణం : నాని, సుధీర్ బాబు, నివేదా థామస్, అదితి రావు హైదరీ తదితరులు

సంగీతం : అమిత్ త్రివేది

నిర్మాతలు : దిల్ రాజు

కథ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం : మోహనకృష్ణ ఇంద్రగంటి

విడుదల తేదీ: 05-09-2020( అమెజాన్ ప్రైమ్ వీడియో)

నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన చిత్రం ‘వి’. ఈ మూవీలో మొదటిసారి నాని నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడు. రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్ సినిమాపై హైప్‌ను అమాంతం పెంచేసింది. ఇక భారీ అంచనాల నడుమ ఈ రోజు అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఈ సమీక్షలో చూద్దాం.

కథ‌ :

ఓ పోలీస్ ఆఫీసర్‌ను హత్య చేసిన నాని.. డీసీపీ ఆదిత్య(సుధీర్ బాబు)కు చిన్న మెసేజ్ వదిలి వెళ్తాడు. తాను నలుగురిని హత్య చేయబోతున్నానని.. దమ్ముంటే తనను ఆపాలని డీసీపీకి ఛాలెంజ్ విసురుతాడు నాని. అసలు నాని ఎందుకు ఈ హత్యలు చేస్తున్నాడు.? అతని మోటివ్ ఏంటి.? డీసీపీ చివరికి ఛాలెంజ్‌లో గెలిచాడా.? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.?

న‌టీన‌టుల అభినయం:

ఎప్పటిలానే నాని ఈ సినిమాలో కూడా తన సహజ నటనతో ప్రేక్షకులను కట్టిపడేశాడు. స్టైలిష్ కిల్లర్‌గా నాని నటన అద్భుతం అని చెప్పాలి. అటు ఎమోషనల్ సీన్స్.. ఇటు యాక్షన్ సీన్స్‌లో చక్కటి ఈజ్‌‌ను చూపించాడు. డీసీపీ ఆదిత్యగా సుధీర్ బాబు సరిగ్గా సరిపోయాడు. సినిమా మొదటిభాగంలో వచ్చే కొన్ని సన్నివేశాలు ఎంతో ఎంగేజింగ్‌గా ఉన్నాయి.

హీరోయిన్ల విషయానికి వస్తే.. నివేదా, అదితి రావు హైదరీ తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు. ఈ సినిమాలో అదితి పాత్ర నిడివి తక్కువే.. అయినా ఆ పాత్రలో ఒదిగిపోయి నటించింది. అటు నివేదా మాత్రం క్రైమ్ నవలా రచయిత్రీగా చక్కటి ప్రదర్శన కనబరిచింది. ఇక మిగిలిన నటీనటులు అందరూ కూడా తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

విశ్లేష‌ణ‌ :

మొదటి భాగంలో వచ్చే కొన్ని సన్నివేశాలు థ్రిల్ కలిగిస్తాయి. అంతేకాకుండా నాని, సుధీర్ బాబు మధ్య ఛేజ్ సీన్స్ అదిరిపోయాయి. సుధీర్ బాబు- నివేదా మధ్య లవ్ సీన్స్ బాగున్నాయి. సెకండ్ హాఫ్‌ కొంచెం లాగ్ అనిపిస్తుంది. ఇకపోతే ప్రీ-క్లైమాక్స్ ఫైట్, ఆ తర్వాత వచ్చే ట్విస్ట్ ప్రేక్షకుల్లో మంచి ఉత్కంఠ రేపుతాయి. ఓవరాల్‌గా ‘విక్రమ్ వేదా’ సినిమా మాదిరిగా.. ఈ మూవీలో కూడా పోలీస్, కిల్లర్ మధ్య వచ్చే సీన్స్ అన్నీ కూడా ఆసక్తిని రేకెత్తిస్తాయి.

సాంకేతిక విభాగాల పనితీరు:

సినిమా బాగుంది. కెమెరా వర్క్ ఆకట్టుకుంటుంది. ‘వస్తున్నా వచ్చేస్తున్నా’, ‘మనసు మారే’ సాంగ్స్ బాగున్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు మరో హైలైట్. నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌ :

నాని, సుధీర్ బాబుల నటన

స్క్రీన్ ప్లే, సస్పెన్స్

మైనస్‌ పాయింట్స్‌ :

సెకండాఫ్‌లో కొన్ని లాగ్ సీన్స్

వెర్డిక్ట్: నాని ‘వి’ ఎక్స్‌పెటేషన్స్ రీచ్ అయింది… 

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు