సీఎం కేసీఆర్‌కు బాల‌య్య స్పెష‌ల్ థ్యాంక్స్‌, కానీ

టాలీవుడ్ సీనియ‌ర్ హీరో నందమూరి బాలకృష్ణ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. తన తండ్రి దివంగ‌త ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర‌ను భవిష్యత్తు తరాలకు తెలిపేలా పాఠ్య పుస్తకాల్లో ప్రచురించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.

సీఎం కేసీఆర్‌కు బాల‌య్య స్పెష‌ల్ థ్యాంక్స్‌,  కానీ
Ram Naramaneni

|

Sep 05, 2020 | 2:01 PM

టాలీవుడ్ సీనియ‌ర్ హీరో నందమూరి బాలకృష్ణ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. తన తండ్రి దివంగ‌త ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర‌ను భవిష్యత్తు తరాలకు తెలిపేలా పాఠ్య పుస్తకాల్లో ప్రచురించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు బాలయ్య సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్‌ చేశారు. పుస్తకంలో కథనానికి సంబంధించిన ఫొటోల్ని కూడా ట్యాగ్ చేశారు.

“కళకి, కళాకారులకి విలువను పెంచిన కధానాయకుడు, తెలుగోడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పీఠాన్ని కదలించేలా వినిపించిన మహానాయకుడు, ఎన్నో సాహసోపేతమైన ప్రజారంజక నిర్ణయాలతో ప్రజల ముంగిటకే ప్రభుత్వాన్ని తెచ్చిన ప్రజానాయకుడు, మదరాసీయులమనే పేరుని చెరిపి భారతదేశపటంలో తెలుగువాడికి, తెలుగు వేడికి ఒక ప్రత్యేకతని తెచ్చిన తెలుగుజాతి ముద్దు బిడ్డ ,అన్నగారు, మా నాన్నగారు నందమూరి తారక రామారావు గారి గురించి భావి తరాలకి స్ఫూర్తినిచ్చేలా 10వ తరగతి సాంఘిక శాస్త్ర పుస్తకం లో పాఠ్యాంశముగా చేర్చిన తెలంగాణా ప్రభుత్వానికి మరియు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు” అని బాలకృష్ణ పేర్కొన్నారు.

https://www.facebook.com/NandamuriBalakrishna/posts/3473490776036430

అయితే ఈ విష‌యంపై ఆరా తీయ‌గా కీల‌క విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఇప్పుడు కాదు..2014లో 10 వ త‌ర‌గ‌తి సాంఘిక‌ శాస్త్రానికి సంబంధించిన పాఠ్యాంశాల్లో ఎన్టీఆర్‌కి సంబంధించిన లెస‌న్ ముద్రించారని తెలిసింది. అది కూడా ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌లో. ఇక ఎన్టీఆర్‌కు సంబంధించిన‌ పూర్తి జీవిత చ‌రిత్ర కాదు. ఒక పేజీలో అన్న‌గారి గురించి, రాజకీయాల్లో ఆయ‌న తెచ్చిన మార్పులు గురించి వివ‌రించారు. ఈ విష‌యం ప్ర‌స్తావించ‌కుండా టీడీపీ సీనియ‌ర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి చేసిన పోస్ట్‌ను టీడీపీ వ‌ర్గాలు హైలెట్ చేస్తున్నాయి. ఏకంగా బాల‌య్య అధికారిక ఫేస్‌బుక్ ఖాతా నుంచి, తెలంగాణ టీడీపీ ట్విట్ట‌ర్ ఖాతా నుంచి కూడా తాజాగా ఈ విష‌యంపై పోస్టులు ప‌డటం గ‌మ‌నార్హం.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu