ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో విషాదం…కరోనాతో ప్రముఖ సంగీత దర్శకుడు మృతి

బాలీవుడ్​ ఫేమ‌స్ సంగీత ద్వయం సాజిద్-వాజిద్​లలో ఒకరైన వాజిద్ ఖాన్.. ఆదివారం రాత్రి(మే 31) క‌న్నుమూశారు. గత కొన్నాళ్లుగా గుండె, కిడ్నీ సమస్యలతో ఇబ్బంది ప‌డుతున్నారు వాజిద్. ఆయ‌న వయ‌స్సు 42 సంత్స‌రాలు. దీనితో పాటే ఇటీవలే ఆయ‌న‌కు కరోనా పోకింది. దీంతో ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా మారింది. దీంతో ముంబయిలోని కోకిలాబెన్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఈయన మృతిపై బాలీవుడ్​ దిగ్భ్రాంతికి గురైంది. ఈ వార్త తమను షాక్​కు గురిచేసిందని ప‌లువురు బాలీవుడ్ […]

ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో విషాదం...కరోనాతో ప్రముఖ సంగీత దర్శకుడు మృతి
Follow us

|

Updated on: Jun 01, 2020 | 8:54 AM

బాలీవుడ్​ ఫేమ‌స్ సంగీత ద్వయం సాజిద్-వాజిద్​లలో ఒకరైన వాజిద్ ఖాన్.. ఆదివారం రాత్రి(మే 31) క‌న్నుమూశారు. గత కొన్నాళ్లుగా గుండె, కిడ్నీ సమస్యలతో ఇబ్బంది ప‌డుతున్నారు వాజిద్. ఆయ‌న వయ‌స్సు 42 సంత్స‌రాలు. దీనితో పాటే ఇటీవలే ఆయ‌న‌కు కరోనా పోకింది. దీంతో ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా మారింది. దీంతో ముంబయిలోని కోకిలాబెన్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఈయన మృతిపై బాలీవుడ్​ దిగ్భ్రాంతికి గురైంది. ఈ వార్త తమను షాక్​కు గురిచేసిందని ప‌లువురు బాలీవుడ్ ప్ర‌ముఖులు రాసుకొస్తున్నారు.

సహచర మ్యూజిక్​ కంపోజ‌ర్​ సలీమ్​ మర్చంట్, వాజిద్ చ‌నిపోయిన విష‌యాన్ని ముందుగా తన ట్విట్టర్​లో పంచుకున్నారు. అనంతరం వరుణ్ ధావన్, ప్రియాంక చోప్రా, సోనూ నిగమ్, విశాల్ దద్లానీ, పరిణితి చోప్రా తదితరులు సంతాపం ప్ర‌క‌టించారు. సాజిద్-వాజిద్.. ఇటీవలే విడుదలైన సల్మాన్​ఖాన్ లాక్​డౌన్​ గీతాలు ‘భాయ్ భాయ్’, ‘ప్యార్ కరోనా’లకు మ్యూజిక్ అందించారు. సల్మాన్​ వీరిని చాలా అభిమానిస్తాడు. ఆయ‌న‌ నటించిన ‘ప్యార్ క్యా తో డర్నా క్యా మూవీతోనే సాజిద్-వాజిద్.. సినీ కెరీర్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత కాలంలో సోనీదే నకరే(పార్టనర్, 2007), జాల్వా(వాంటెడ్, 2009), సురులీ అకియోన్ వాలే(వీర్, 2010), మున్నీ బద్నామ్ హుయి(దబాంగ్, 2010) సినిమాలతో స‌త్తా చాటారు. దిగ్గజ తబాలా ప్లేయర్ ఉస్తాద్ షరాఫత్ హుస్సేన్ ఖాన్ కుమారుడే వాజిద్ ఖాన్.​