AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాసర ఆర్జీయూకేటీలో అగ్ని ప్రమాదం.. రూ.20 లక్షల ఆస్తి నష్టం

నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ, ట్రిపుల్ ఐటీలో మళ్లీ అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్‌తో ఆదివారం తెల్లవారుజామున అకడమిక్ బ్లాక్-1 తరగతి గదిలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఉదయం అటుగా వాకింగ్‌కు వెళ్తున్న వారు ఈ మంటలను గుర్తించి వెంటనే అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న భైంసా అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి మంటలు ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ఏబీ-1 బ్లాక్‌లోని ఫర్నీచర్, ప్రాజెక్టర్, కుర్చీలు, టేబుల్స్ పూర్తిగా దగ్ధమవ్వడంతో.. క్యాంపస్ […]

బాసర ఆర్జీయూకేటీలో అగ్ని ప్రమాదం.. రూ.20 లక్షల ఆస్తి నష్టం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 01, 2020 | 7:48 AM

Share

నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ, ట్రిపుల్ ఐటీలో మళ్లీ అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్‌తో ఆదివారం తెల్లవారుజామున అకడమిక్ బ్లాక్-1 తరగతి గదిలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఉదయం అటుగా వాకింగ్‌కు వెళ్తున్న వారు ఈ మంటలను గుర్తించి వెంటనే అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న భైంసా అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి మంటలు ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ఏబీ-1 బ్లాక్‌లోని ఫర్నీచర్, ప్రాజెక్టర్, కుర్చీలు, టేబుల్స్ పూర్తిగా దగ్ధమవ్వడంతో.. క్యాంపస్ పూర్తిగా పొగతో నిండిపోయింది. దాదాపు రూ.20 లక్షల నష్టం జరిగిందని ఆర్జీయూకేటీ అధికారులు చెబుతున్నారు.

కాగా ఈ ప్రమాదంపై విద్యాలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఇప్పటికే బాసర ట్రిపుల్ ఐటీలో రెండుసార్లు ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకున్నాయని, 2 నెలల నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన వార్తలు ఆలస్యంగా బయటకువచ్చాయి.

ఇది కూడా చదవండి:

రైతులకు కేంద్రం అందించే బంపర్ ఆఫర్.. చివరి తేదీ ఇదే!

బిగ్ బ్రేకింగ్: జూన్‌ 30 వరకూ లాక్‌డౌన్ పొడిగించిన తెలంగాణ సర్కార్

‘ఆ బడా డైరెక్టర్ బాగోతం బయటపెడతా’.. బిగ్‌బాస్ నందినీ సంచలన కామెంట్స్

Follow Us
రిలయన్స్ జోరు.. కేవలం 4 రోజుల్లో రూ. 1.39 లక్షల కోట్ల లాభం!
రిలయన్స్ జోరు.. కేవలం 4 రోజుల్లో రూ. 1.39 లక్షల కోట్ల లాభం!
శుక్రుడితో లక్ష్మీ యోగం! ఆ రాశుల వారికి సిరిసంపదలు ఖాయం..!
శుక్రుడితో లక్ష్మీ యోగం! ఆ రాశుల వారికి సిరిసంపదలు ఖాయం..!
చనిపోయిన భర్త కల నెరవేర్చిన టాలీవుడ్ హీరోయిన్.. బ్యూటిఫుల్ వీడియో
చనిపోయిన భర్త కల నెరవేర్చిన టాలీవుడ్ హీరోయిన్.. బ్యూటిఫుల్ వీడియో
టెట్‌ 2026కు భారీగా తగ్గిన దరఖాస్తులు.. పరీక్షలు ఎప్పుడంటే?
టెట్‌ 2026కు భారీగా తగ్గిన దరఖాస్తులు.. పరీక్షలు ఎప్పుడంటే?
సెప్టెంబర్ 8 నుండి ఈ ఫోన్లలో వాట్సాప్ బంద్! మీ ఫోన్ కూడా ఉందా?
సెప్టెంబర్ 8 నుండి ఈ ఫోన్లలో వాట్సాప్ బంద్! మీ ఫోన్ కూడా ఉందా?
తమిళనాడు సీఎం స్టాలిన్ ఘోర పరాజయం..
తమిళనాడు సీఎం స్టాలిన్ ఘోర పరాజయం..
టీవీకే విజయంపై విజయ్ తండ్రి చంద్రశేఖర్ ఏమన్నారంటే..
టీవీకే విజయంపై విజయ్ తండ్రి చంద్రశేఖర్ ఏమన్నారంటే..
నాలుగు గ్రహాల కటాక్షం.. అదృష్టం వారి తలుపు తట్టే ఛాన్స్..!
నాలుగు గ్రహాల కటాక్షం.. అదృష్టం వారి తలుపు తట్టే ఛాన్స్..!
ప్రపంచంలో అత్యధిక బంగారు నిల్వలు ఉన్న దేశాలు ఏవి? భారతదేశం ఎక్కడ?
ప్రపంచంలో అత్యధిక బంగారు నిల్వలు ఉన్న దేశాలు ఏవి? భారతదేశం ఎక్కడ?
ఓటమి దిశగా డీఎంకే పార్టీ.. వెక్కివెక్కి ఏడ్చిన కార్యకర్త
ఓటమి దిశగా డీఎంకే పార్టీ.. వెక్కివెక్కి ఏడ్చిన కార్యకర్త