AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. ఇప్పటివరకు ఉన్న టాప్ 9 హైలెట్స్

AP Municipal and Corporation Election Results: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్, నగరపాలక సంస్థల ఎన్నికల ఫలితాల్లో కూటమి ప్రభంజనం సృష్టించింది. విశాఖ, తిరుపతి, చిత్తూరు వంటి ప్రధాన కార్పొరేషన్లను కూటమి క్లీన్‌స్వీప్ చేయడమే కాకుండా వైసీపీ కంచుకోట పులివెందులలోనూ రికార్డు మెజార్టీతో విజయకేతనం ఎగురవేసింది. పిఠాపురం, గొల్లప్రోలులలో జనసేన తిరుగులేని పట్టు సాధించగా.. పలుచోట్ల ఉత్కంఠ పోరు, ఆసక్తికర ఫలితాల నడుమ రాష్ట్రవ్యాప్తంగా కూటమి విజయబావుటా ఎగురవేసింది.

Andhra Pradesh: ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. ఇప్పటివరకు ఉన్న టాప్ 9 హైలెట్స్
Ap Municipal And Corporation Election Results 2026
Krishna S
|

Updated on: Nov 03, 2026 | 7:26 PM

Share

ఏపీ వ్యాప్తంగా వెలువడిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో కూటమి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. విశాఖ నుంచి తిరుపతి దాకా మెజారిటీ పీఠాలను కైవసం చేసుకుంటూ పసుపు-సేన జెండా రెపరెపలాడింది. పులివెందులలో వైసీపీకి ఊహించని పరాభవం ఎదురుకాగా, పిఠాపురం, గొల్లప్రోలు పీఠాలు జనసేన పరమయ్యాయి. ధర్మవరంలో ఒక్క ఓటుతో వైసీపీ విజయం సాధించింది. అంతేకాకుండా విశాఖ కార్పొరేషన్‌లో వైసీపీ నుంచి తండ్రీకూతుళ్ల విజయం సాధించడం ఆసక్తిగా మారింది.

తిరుపతి కార్పొరేషన్

తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూటమి విజయదుందుభి మోగించింది. తిరుపతి కార్పొరేషన్ తెదేపా మేయర్ అభ్యర్థిగా మన్నెం శ్రీనివాస ప్రసాద్ ఘన విజయం సాధించారు. ఇక్కడ మొత్తం 66 స్థానాలకు ఎన్నికలు జరగగా, బీజేపీ 38, జనసేన 19, బీజేపీ 3 స్థానాలను కైవసం చేసుకుని కూటమి ప్రభంజనం సృష్టించింది. ప్రధాన ప్రత్యర్థి వైసీపీ కేవలం 3 స్థానాలకే పరిమితం కాగా, ఇతరులు 3 డివిజన్లలో విజయం సాధించారు.

పులివెందుల మున్సిపాలిటీ

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత ఇలాకా అయిన కడప జిల్లా పులివెందుల మున్సిపాలిటీలో కూటమి చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. టీడీపీ ఛైర్‌పర్సన్‌ అభ్యర్థి గీతాకుమారి ఏకంగా 13,875 ఓట్ల రికార్డు మెజార్టీతో విజయం సాధించారు. మొత్తం పోలింగ్ జరిగిన 20 వార్డుల్లో 17 వార్డులను కూటమి గెలుచుకోగా, ముందస్తు ఏకగ్రీవాలతో కలిపి మొత్తం 37 వార్డుల్లో కూటమి విజయకేతనం ఎగురవేసింది. ఇక్కడ వైసీపీ కేవలం 3 వార్డులకే పరిమితమైంది.

నందికొట్కూరు మున్సిపాలిటీ

రాష్ట్రవ్యాప్తంగా కూటమి హవా నడుస్తున్న వేళ నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీలో మాత్రం భిన్నమైన ఫలితం కనిపించింది. వైసీపీ ఇక్కడ తిరుగులేని విజయాన్ని సాధించి మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. మొత్తం 32 వార్డులకు గానూ ఏకంగా 23 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు జయకేతనం ఎగురవేయడంతో మున్సిపల్ పీఠం వైసీపీ పరమైంది.

చిత్తూరు కార్పొరేషన్

చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ కూటమి స్పష్టమైన ఆధిక్యతతో పీఠాన్ని కైవసం చేసుకుంది. చిత్తూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కఠారి హేమలత ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. మొత్తం 60 స్థానాలకు గానూ తెదేపా ఏకంగా 51 డివిజన్లను క్లీన్‌స్వీప్ చేయగా, మిత్రపక్షాలైన జనసేన 2, బీజేపీ 1 స్థానాన్ని గెలుచుకున్నాయి. ఇక వైసీపీ కేవలం 4 డివిజన్లలో, ఇతరులు ఒక డివిజన్‌లో గెలుపొందగా, మరో స్థానానికి సంబంధించిన ఫలితం వెల్లడి కావాల్సి ఉంది.

విశాఖ జీవీఎంసీ కార్పొరేషన్

విశాఖపట్నం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) ఎన్నికల కౌంటింగ్‌లో కూటమి భారీ మెజార్టీ దిశగా దూసుకుపోతోంది. మొత్తం లెక్కించిన 4,36,676 ఓట్లలో టీడీపీకి 2,56,881 ఓట్లు రాగా, వైసీపీకి 1,37,194, ఇతరులకు 37,163, కాంగ్రెస్‌కు 5,434 ఓట్లు పోలయ్యాయి. దీంతో తెదేపా మేయర్ అభ్యర్థి ఏకంగా 1,19,683 ఓట్ల భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తం 120 డివిజన్లకు గానూ ఇప్పటివరకు టీడీపీ 27, జనసేన 10, బీజేపీ 5 (మొత్తం కూటమి 42 డివిజన్లలో విజయం), వైసీపీ 4, ఇతరులు 2 స్థానాల్లో గెలుపొందగా, మరో 24 డివిజన్లలో కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

వైసీపీ నుంచి తండ్రికూతుళ్ల గెలుపు

మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ప్రభంజనం సృష్టిస్తుండగా.. ఓ చోట మాత్రం వైసీపీకి చెందిన తండ్రీకూతుళ్లు గెలవడం ఆసక్తిగా మారింది. గ్రేటర్ విశాఖలో 6వ వార్డు నుంచి పోతిన హనుమంతరావు 150 ఓట్ల మెజార్టీతో గెలిపొందగా, 7వ వార్డు నుంచి ఆయన కూతురు జాహ్నవి విజయం సాధించారు. ఇద్దరూ గెలుపుతో కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణుల్లో సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ టీడీపీ అభ్యర్థి మేయర్ అభ్యర్థి శ్రావణి భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

ఒక్క ఓటుతో వైసీపీ గెలుపు

ధర్మవరం మున్సిపాలిటీలోని 1వ వార్డు ఎన్నికల ఫలితం తీవ్ర ఉత్కంఠ మధ్య వెలువడింది. వైసీపీ అభ్యర్థి చెలిమి రామకృష్ణమ్మ తన ప్రత్యర్థిపై కేవలం ఒక్క ఓటు ఆధిక్యంతో విజయం సాధించారు. ఓట్ల లెక్కింపులో స్వల్ప తేడా ఉండటంతో బీజేపీ అభ్యర్థి సాకే లక్ష్మీదేవి ఫలితంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రీకౌంటింగ్ నిర్వహించాలని అధికారులను కోరారు. ఆమె రిక్వెస్ట్ మేరకు ఎన్నికల అధికారులు మరోసారి ఓట్లను లెక్కించారు. అయితే, రీకౌంటింగ్‌లోనూ ఫలితంలో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు. వైసీపీ అభ్యర్థి రామకృష్ణమ్మ ఒక్క ఓటు ఆధిక్యంతో గెలిచినట్లు అధికారులు మరోసారి నిర్ధారించి అధికారికంగా ప్రకటించారు.

గొల్లప్రోలు జనసేనదే..

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి హవా కొనసాగుతుంది. గొల్లప్రోలు మున్సిపాలిటీని జనసేన కైవసం చేసుకుంది. కాకినాడ జిల్లా గొల్లప్రోలో జనసేన అభ్యర్థి తమ్మయ్య నాయుడు విజయం సాధించారు. మొత్తం 23 వార్డులకు గానూ జనసేన 13, టీడీపీ 6, ఇతరులు 4 వార్డుల్లో గెలిపొందారు. ఇక్కడ వైసీపీ వార్డూ గెలవని

పిఠాపురం మున్సిపాలిటీ

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సొంత ఇలాకా పిఠాపురం మున్సిపాలిటీ ఎన్నికల్లో జనసేన పార్టీ తిరుగులేని విజయాన్ని సాధించింది. మున్సిపల్ ఛైర్మన్‌గా జనసేన అభ్యర్థి దానం లాజర్ బాబు 8,944 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. మొత్తం 36 వార్డులకు గానూ 3 వార్డులు ముందే ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో కూటమి భాగస్వామ్య పక్షాలైన జనసేన 16, టీడీపీ 5, బీజేపీ1 స్థానాన్ని గెలుచుకుని మున్సిపాలిటీపై పట్టు సాధించాయి. మిగిలిన స్థానాల్లో స్వతంత్రులు 10 వార్డులను కైవసం చేసుకోగా, వైసీపీ కేవలం ఒక్క వార్డుకే పరిమితమైంది.

Follow Us
ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. ఇప్పటివరకు ఉన్న టాప్ 9 హైలెట్స్
ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. ఇప్పటివరకు ఉన్న టాప్ 9 హైలెట్స్
 ఒక్కో రోజుకు ఒక్కో కథ.. దీపావళి ఐదు రోజుల పండుగ వెనుక అసలు అర్థం
 ఒక్కో రోజుకు ఒక్కో కథ.. దీపావళి ఐదు రోజుల పండుగ వెనుక అసలు అర్థం
ఇక పై జాగ్రత్తగా మాట్లాడతా: సాయి పల్లవి
ఇక పై జాగ్రత్తగా మాట్లాడతా: సాయి పల్లవి
ఇంట్లో ఈ  పెయింటింగ్స్ పెడితే అదృష్టం కలిసొస్తుందా?  
ఇంట్లో ఈ  పెయింటింగ్స్ పెడితే అదృష్టం కలిసొస్తుందా?  
ఐటీ ఉద్యోగులకు అలర్ట్.. ఈ 3 రోజులు వర్క్ ఫ్రం హోమ్!
ఐటీ ఉద్యోగులకు అలర్ట్.. ఈ 3 రోజులు వర్క్ ఫ్రం హోమ్!
దీపావళి గిఫ్ట్ రూ.8 లక్షలు..ఇలా చేశారంటే చాలు బ్యాంక్ ఖాతా ఖాళీ..
దీపావళి గిఫ్ట్ రూ.8 లక్షలు..ఇలా చేశారంటే చాలు బ్యాంక్ ఖాతా ఖాళీ..
ఇంట్లో రవ్వ, పాలకూర ఉంటే చాలు.. టేస్టీ పాలక్ పన్నీర్ ఉత్తప్పం
ఇంట్లో రవ్వ, పాలకూర ఉంటే చాలు.. టేస్టీ పాలక్ పన్నీర్ ఉత్తప్పం
కాళ్లలో మునుపటి బలం లేదు.. పండు మాస్టర్ కన్నీళ్లు.. వీడియో
కాళ్లలో మునుపటి బలం లేదు.. పండు మాస్టర్ కన్నీళ్లు.. వీడియో
జిమ్‌కు వెళ్లకున్నా స్లిమ్‌గా? నెట్టింట వైరలవుతున్న వర్కవుట్
జిమ్‌కు వెళ్లకున్నా స్లిమ్‌గా? నెట్టింట వైరలవుతున్న వర్కవుట్
టీమిండియా ప్లేయింగ్ XI ఫిక్స్..? ఫస్ట్ 5 ప్లేస్‌లు చూస్తే..
టీమిండియా ప్లేయింగ్ XI ఫిక్స్..? ఫస్ట్ 5 ప్లేస్‌లు చూస్తే..