Munawar Faruqui: హైటెన్షన్ మధ్య ముగిసిన మునావర్ కామెడీ షో.. బీజేపీ కార్యకర్తల ఆందోళనలతో తీవ్ర ఉద్రిక్తత

దాదాపు రెండున్నర గంటలపాటు స్టాండప్ కామెడీయన్ షో జరిగింది. ఆడిటోరియం లోపల ప్రతి వరుస వద్దా పోలీసుల్ని మోహరించి ఎవరూ స్టేజ్‌ వైపు ఎవరూ వెళ్లకుండా కట్టడి చేశారు.

Munawar Faruqui: హైటెన్షన్ మధ్య ముగిసిన మునావర్ కామెడీ షో.. బీజేపీ కార్యకర్తల ఆందోళనలతో తీవ్ర ఉద్రిక్తత
Munawar Faruqui
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 20, 2022 | 8:30 PM

Comedian Munawar Faruqui: హైదరాబాద్‌ శిల్ప కళావేదికలో హైటెన్షన్ మధ్య మునావర్ ఫారుఖీ కామెడీ షో (Munawar Faruqui comedy show) ముగిసింది. షో కోసం టికెట్ తీసుకుని వెళ్లిన వాళ్లు ఎంత మంది ఉన్నారో.. అదే స్థాయిలో లోపల పోలీసులు కూడా కనిపించారు. దాదాపు రెండున్నర గంటలపాటు స్టాండప్ కామెడీయన్ షో జరిగింది. ఆడిటోరియం లోపల ప్రతి వరుస వద్దా పోలీసుల్ని మోహరించి ఎవరూ స్టేజ్‌ వైపు ఎవరూ వెళ్లకుండా కట్టడి చేశారు. బీజేపీ కార్యకర్తలు కూడా టికెట్లు తీసుకుని షోకి వచ్చి ఆటంకం కలిగించవచ్చనే ఉద్దేశంతో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 5 గంటలకు.. శిల్పకళావేదికలో మునావర్‌ కామెడీ షో ప్రారంభమైంది. బులెట్‌ప్రూఫ్‌ వెహికల్‌లో మునావర్‌ వచ్చాడు. లోపల కామెడీ షో.. బయట బీజేపీ కార్యకర్తల ఆందోళనలతో.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ షో అడ్డుకునేందుకు బీజేపీ కార్యకర్తలు చాలా ప్రయత్నించారు. పదుల సంఖ్యలో ముట్టడికి ప్రయత్నించారు. వచ్చిన వాళ్లను వచ్చినట్టు అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. కొందరు మహిళా కార్యకర్తల్ని కూడా అరెస్టు చేశారు. శిల్పకళావేదిక వద్ద ఇంకా భారీ బందోబస్తు కొనసాగుతోంది.

సాయంత్రం వేళ శిల్పకళా వేదిక దగ్గరకు బ్యాచ్‌లు బ్యాచ్‌లుగా వచ్చారు బీజేపీ కార్యకర్తలు. పోలీసులు కూడా అలర్ట్‌గా ఉండి వారిని అరెస్ట్ చేశారు. ఆ చుట్టుపక్కల బస్టాండ్‌లలోను తనిఖీలు చేశారు. అనుమానాస్పదంగా కనిపించినవారిని అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ కార్యకర్తలు కొందరు SOT పోలీసుల డ్రెస్సుల్లో వచ్చారు. అప్పటికే అక్కడ పెద్దసంఖ్యలో మోహరించిన పోలీసులు.. వారిని అడ్డుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!