RR vs MI : దూకుడు మీదున్న ముంబై

రాజస్థాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేస్తున్న ముంబై ఇండియన్స్‌ దూకుడును ప్రదర్శిస్తోంది. పవర్‌ప్లేలో చివరి  వికెట్‌ నష్టానికి 59 పరుగులు చేసింది. స్టార్‌ ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌(6) తొలి ఓవర్‌లో వెనుదిరిగాడు. జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో..

RR vs MI : దూకుడు మీదున్న ముంబై
Follow us

|

Updated on: Oct 25, 2020 | 8:37 PM

రాజస్థాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేస్తున్న ముంబై ఇండియన్స్‌ దూకుడును ప్రదర్శిస్తోంది. పవర్‌ప్లేలో చివరి  వికెట్‌ నష్టానికి 59 పరుగులు చేసింది. స్టార్‌ ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌(6) తొలి ఓవర్‌లో వెనుదిరిగాడు. జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో సూపర్‌ ఫామ్‌లో ఉన్న డికాక్‌ బౌల్డ్‌ అయ్యాడు. వన్‌డౌన్‌లో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్‌ యాదవ్‌ జోరుగా బ్యాటింగ్‌ చేస్తూ దూకుడు ప్రదర్శిస్తున్నాడు.

యువ ఓపెనర్‌ ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును ముందుండి నడిపిస్తున్నాడు. 8 ఓవర్లకు ముంబై వికెట్‌ నష్టానికి 67 పరుగులు చేసింది. మంచి జోష్ మీదున్న కిషన్‌ , సూర్యకుమార్‌ జోడీకి బ్రేక్ పడింది.

అబుదాబి వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌, ముంబై ఇండియన్స్‌ తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన ముంబై తాత్కాలిక కెప్టెన్‌ పొలార్డ్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. పేసర్‌ నాథన్‌ కౌల్టర్‌ నైల్‌ స్థానంలో పాటిన్సన్‌ తుది జట్టులోకి వచ్చాడు. రాజస్థాన్‌ రాయల్స్‌ ఇప్పటికే ప్లేఆఫ్‌ రేసు నుంచి నిష్క్రమించింది. ఆడిన 10 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలతో ముంబై టేబుల్‌ టాప్‌లో ఉండగా.. రాజస్థాన్‌ 11 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో ఆఖరి స్థానంలో ఉంది. గాయం కారణంగా ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు.