MI vs RCB : టాస్ గెలిచిన ముంబై
Mumbai Indians Win The Toss : రసవత్తరంగా సాగుతున్న ఐపీఎల్ – 13లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. అబుదాబి వేదికగా జరుగుతున్న ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ప్లేఆఫ్ బెర్తు ఖాయం చేసుకోనుంది. టాస్ గెలిచిన ముంబై తాత్కాలిక కెప్టెన్ కీరన్ పొలార్డ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. తొడ కండరాల గాయంతో రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. బెంగళూరు జట్టులో మార్పులు చోటుచేసుకున్నాయి. […]
Mumbai Indians Win The Toss : రసవత్తరంగా సాగుతున్న ఐపీఎల్ – 13లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. అబుదాబి వేదికగా జరుగుతున్న ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ప్లేఆఫ్ బెర్తు ఖాయం చేసుకోనుంది. టాస్ గెలిచిన ముంబై తాత్కాలిక కెప్టెన్ కీరన్ పొలార్డ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. తొడ కండరాల గాయంతో రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు.
బెంగళూరు జట్టులో మార్పులు చోటుచేసుకున్నాయి. నవదీప్ సైనీ స్థానంలో శివమ్ దూబే, అరోన్ ఫించ్ స్థానంలో జోష్ ఫిలిఫ్, మొయిన్ అలీ స్థానంలో డేల్ స్టెయిన్‌లను జట్టులోకి తీసుకున్నట్లు బెంగళూరు సారథి కోహ్లీ తెలిపారు. ఇరు జట్ల వివరాలు ఇలా ఉన్నాయి….
ముంబై జట్టు సభ్యులు : డికాక్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్, సౌరభ్ తివారి, హార్దిక్ పాండ్య, పొలార్డ్ (కెప్టెన్), కృనాల్ పాండ్య, ప్యాటిన్సన్, రాహుల్ చాహర్, బౌల్ట్, బుమ్రా
బెంగళూరు జట్టు సభ్యులు : పడిక్కల్, ఫిలిప్, కోహ్లీ (కెప్టెన్), డివిలియర్స్, దూబె, గుర్‌కీరత్ సింగ్, క్రిస్ మోరిస్, వాషింగ్టన్ సుందర్, డేల్ స్టెయిన్, సిరాజ్, చాహల్
#MumbaiIndians Captain Kieron Pollard wins the toss and elects to bowl first against #RCB #Dream11IPL pic.twitter.com/m6voxFiOOt
— IndianPremierLeague (@IPL) October 28, 2020