AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రియురాలితో భర్తకు పెళ్లి జరిపించిన భార్యామణి

వెనకటి తెలుగు సినిమాల్లోలాగే భోపాల్‌లో ఓ సంఘటన జరిగింది. ఇద్దరు హీరోయిన్లు ఉన్న నాగేశ్వరరావు, శోభన్‌బాబు సినిమాల్లో ఓ హీరోయిన్‌ త్యాగం చేసినట్టుగానే భర్త ఆనందం కోసం ఓ భార్య తన జీవితాన్నే త్యాగం చేసింది.. భర్తను, అతడి ప్రియురాలిని కలిపి త్యాగశీలవమ్మా మహిళా.. అనురాగశీలవమ్మా ..తోటివారికై సకలము నొసగే కరుణామయివమ్మా అనే పాటను గుర్తు చేసింది.. భోపాల్‌లోని ఓ జంటకు మూడేళ్ల కిందట పెళ్లయింది.. అయితే గతంలో తన భర్త ఓ యువతని ప్రేమించినట్టు తెలుసుకుంది […]

ప్రియురాలితో భర్తకు పెళ్లి జరిపించిన భార్యామణి
Balu
|

Updated on: Nov 07, 2020 | 4:18 PM

Share

వెనకటి తెలుగు సినిమాల్లోలాగే భోపాల్‌లో ఓ సంఘటన జరిగింది. ఇద్దరు హీరోయిన్లు ఉన్న నాగేశ్వరరావు, శోభన్‌బాబు సినిమాల్లో ఓ హీరోయిన్‌ త్యాగం చేసినట్టుగానే భర్త ఆనందం కోసం ఓ భార్య తన జీవితాన్నే త్యాగం చేసింది.. భర్తను, అతడి ప్రియురాలిని కలిపి త్యాగశీలవమ్మా మహిళా.. అనురాగశీలవమ్మా ..తోటివారికై సకలము నొసగే కరుణామయివమ్మా అనే పాటను గుర్తు చేసింది.. భోపాల్‌లోని ఓ జంటకు మూడేళ్ల కిందట పెళ్లయింది.. అయితే గతంలో తన భర్త ఓ యువతని ప్రేమించినట్టు తెలుసుకుంది భార్యామణి.. పెళ్లయినా ఆమెను అతగాడు మర్చిపోలేకపోతున్నాడని గ్రహించింది.. ఓరోజు తాను ఆమెను కూడా పెళ్లి చేసుకుంటానని, ముగ్గురం కలిసి ఆనందంగా ఉండొచ్చని భార్యతో అన్నాడు.. అయితే చట్టం అందుకు ఒప్పుకోదని భార్య చెప్పింది.. చెప్పడమే కాదు, మూడేళ్ల వివాహజీవితాన్ని వదులుకోడానికి సిద్ధపడింది. భర్త సుఖం కోసం తన జీవితాన్ని త్యాగం చేసింది.. భర్తకు విడాకులు ఇచ్చింది.. ప్రేమికురాలితో భర్తకు పెళ్లి చేసింది.. ఈ విడాకుల కేసును వాదించిన మహిళా న్యాయవాది ఈ విషయాన్ని చెప్పింది కానీ లేకపోతే ఈ సినిమాకు సరిపడే కథ మనకు తెలిసేదే కాదు…! ఈ స్టోరీ అంతా చదివాక మీకు హమ్‌ దిల్‌ దే చుకే సనమ్‌ సినిమా గుర్తుకు రావచ్చు …

Follow Us
తెలంగాణ వాసులకు గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
తెలంగాణ వాసులకు గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
పిల్లలే కాదు,పెద్దలు మెచ్చే కొబ్బరి హల్వ..ఇలా చేస్తే నోరూరిపోతది
పిల్లలే కాదు,పెద్దలు మెచ్చే కొబ్బరి హల్వ..ఇలా చేస్తే నోరూరిపోతది
ఆ ఇద్దరు కావాలి.. 40 ఓవర్లు మాత్రం వద్దు..!
ఆ ఇద్దరు కావాలి.. 40 ఓవర్లు మాత్రం వద్దు..!
Googleలో ఏది పడితే అది వెతుకుతున్నారా? జాగ్రత్త..!
Googleలో ఏది పడితే అది వెతుకుతున్నారా? జాగ్రత్త..!
యూట్యూబ్‌లో చూసి వైన్ తయారు చేశాడు.. 6 నెలల్లో ఎంత సంపాదించాడంటే
యూట్యూబ్‌లో చూసి వైన్ తయారు చేశాడు.. 6 నెలల్లో ఎంత సంపాదించాడంటే
7 రికార్డులపై కన్నేసిన కింగ్.. ప్రమాదంలో సచిన్ అరుదైన హిస్టరీ..!
7 రికార్డులపై కన్నేసిన కింగ్.. ప్రమాదంలో సచిన్ అరుదైన హిస్టరీ..!
జులై 19 వరకు అక్కడ అన్ని బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు
జులై 19 వరకు అక్కడ అన్ని బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు
తనను కాటేసిందని కోపంతో పామునే కొరికేసిన యువకుడు
తనను కాటేసిందని కోపంతో పామునే కొరికేసిన యువకుడు
ఇంగ్లండ్ గడ్డపై తొలిసారి వన్డే ఆడనున్న 8 మంది.. తొలి పేరు షాకింగే
ఇంగ్లండ్ గడ్డపై తొలిసారి వన్డే ఆడనున్న 8 మంది.. తొలి పేరు షాకింగే
రోజ్మెరీతో అందం.. ఆరోగ్యం.. ఒక్కసారి నాటితే 30 ఏళ్లు బతుకుతుంది..
రోజ్మెరీతో అందం.. ఆరోగ్యం.. ఒక్కసారి నాటితే 30 ఏళ్లు బతుకుతుంది..