చెడుపై మంచి సాధించిన విజయం..

Ravan Dahan at Amberpet : చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా. రాముడు రావణ సంహారం గావించిన సందర్భాన్ని పురస్కరించుకుని నగరవ్యాప్తంగా రావణ వధ కార్యక్రమం జరిగింది. అంబర్‌పేట్‌లోని మున్సిపల్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన రావణ దహనంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. అంబర్‌పేటలో రావణ దహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్వర్లు, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ హాజరయ్యారు. మహంకాళీ ఆలయం వద్ద 30 ఏళ్లుగా […]

  • Sanjay Kasula
  • Publish Date - 12:26 am, Mon, 26 October 20
చెడుపై మంచి సాధించిన విజయం..

Ravan Dahan at Amberpet : చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా. రాముడు రావణ సంహారం గావించిన సందర్భాన్ని పురస్కరించుకుని నగరవ్యాప్తంగా రావణ వధ కార్యక్రమం జరిగింది. అంబర్‌పేట్‌లోని మున్సిపల్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన రావణ దహనంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు.

అంబర్‌పేటలో రావణ దహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్వర్లు, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ హాజరయ్యారు. మహంకాళీ ఆలయం వద్ద 30 ఏళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఏడాది కరోనా కారణంగా కొద్దిమంది సందర్శకులకే అనుమతినిచ్చారు.

అయితే విజయానికి సంకేతంగా దసరా పండుగను జరుపుకుంటారు. దసరా రోజు దేశవ్యాప్తంగా రావణ దహన వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. శ్రీరాముడి చేతిలో రావణుడి ఓటమికి దసరా రోజు జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. శ్రీరాముడి కాలం నుంచే విజయదశమిని విజయ ప్రస్థానంగా పరిగణించారు. ఈ రోజే రావణుడిపై రాముడు దండెత్తి విజయం సాధించారని చెబుతుంటారు. అందువల్ల రావణుడి దిష్టి బొమ్మను తగలబెట్టే సంప్రదాయం ఏర్పడిందని చెబుతుంటారు.