ఏపీ ప్రజలకు జగన్ బంపర్ ఆఫర్.. వివరాలు వింటే జై కొట్టాల్సిందే !
ఏపీ ప్రజలకు ఈ బుధవారం సంబరాలు చేసుకోవాల్సిన రోజుగా మిగిలిపోయేలా వుంది. కారణం ఏపీ ప్రభుత్వం చేనేత కార్మికులకు, మత్స్యకారులకు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు, హోంగార్డులకు, మధ్యాహ్న భోజన కార్మికులకు, జూనియర్ న్యాయవాదులకు, ముఖ్యంగా నిరుద్యోగ యువతకు బంపర్ బొనాంజా ప్రకటించింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్యక్షతన బుధవారం అమరావతి సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రి వర్గం సమావేశంలో నిర్ణయం తీసుకున్న నిర్ణయాలు, వాటి తాలూకు వివరాలు చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. కూర్చొన్న చోటి వేలాది రూపాయలు […]
ఏపీ ప్రజలకు ఈ బుధవారం సంబరాలు చేసుకోవాల్సిన రోజుగా మిగిలిపోయేలా వుంది. కారణం ఏపీ ప్రభుత్వం చేనేత కార్మికులకు, మత్స్యకారులకు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు, హోంగార్డులకు, మధ్యాహ్న భోజన కార్మికులకు, జూనియర్ న్యాయవాదులకు, ముఖ్యంగా నిరుద్యోగ యువతకు బంపర్ బొనాంజా ప్రకటించింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్యక్షతన బుధవారం అమరావతి సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రి వర్గం సమావేశంలో నిర్ణయం తీసుకున్న నిర్ణయాలు, వాటి తాలూకు వివరాలు చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. కూర్చొన్న చోటి వేలాది రూపాయలు చేరేలా అద్బుత పథకాల్ని గతంలో ప్రకటించిన జగన్… వాటి ఆచరణలోను దూకుడు ప్రదర్శిస్తున్నారు. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఏపీ ప్రజలపై వరాల జల్లు కురిపిస్తున్నారు.
బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు :
- చేనేత లకు ఒక్కో కుటుంబానికి ఏటా 24 వేల ఆర్థిక సాయం.
- డిసెంబర్ 21 నుంచి వైఎస్సార్ నేతన్న చేయూత కింద ఆర్థిక సాయం అందజేత.
- వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు 10 వేల ఆర్థిక సాయం చేయాలని నిర్ణయం.
- మోటార్ బొట్లతో పాటు తెప్పలపై వేట చేసుకునే వారికి కూడా ఆర్థిక సాయం అందించాలని నిర్ణయం.
- ప్రభుత్వంపై 100 కోట్ల మేర భారం.
- మత్స్యకారుల బోట్లకు డీజిల్ పై ఇచ్చే సబ్సిడీ 50 శాతం పెంపు.
- ముమ్మిడివరం నియోజకవర్గం లో ongc వల్ల నష్టపోయిన 1650 కుటుంబాలకు నవంబర్ 21న పరిహారం.
- రక్షిత తాగునీరు అందించేందుకు వాటర్ గ్రిడ్ పథకం ద్వారా నీటి సరఫరా.
- మధ్యాహ్నం భోజనం కార్మికులకు 1000 నుంచి 3000 వేలకు గౌరవ వేతనం పెంపు.
- ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం.
- పలాస లో నిర్మించే కిడ్నీ ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు కేబినెట్ ఆమోదం.
- డిసెంబర్ 3 నుంచి న్యాయవాదులకు ఐదువేల ఆర్థిక సాయం అందజేత.
- వివిధ సంక్షేమ కార్పొరేషన్ ల ద్వారా నిరుద్యోగ యువతకు వాహనాల కొనుగోలుకు సబ్సిడీ
- ఏపీఎస్ ఆర్టీసీ లో కాలం చెల్లిన 3వేల500 బస్సుల స్థానంలో కొత్త బస్సుల కొనుగోలు కు ప్రభుత్వం గ్యారంటీ
- 1000 కోట్ల రుణం తీసుకునేందుకు గ్యారంటీ ఇచ్చేందుకు క్యాబినెట్ ఆమోదం
- చిరు ధాన్యాలు,అపరాలు బోర్డు ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం.
- విశాఖలో ఆమోద పబ్లికేషన్స్ కు ఇచ్చిన భూములు రద్దు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం.
ఏపీ కేబినెట్ తీసుకున్న మరిన్ని నిర్ణయాలు :