Indian Parliament: జులై 19వ తేదీ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు..!
Indian Parliament: భారత పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 19వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు వర్షాకాల సమావేశాల..
Indian Parliament: భారత పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 19వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు వర్షాకాల సమావేశాల నిర్వహణ తేదీలను పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీ మంగళవారం నాడు నిర్ణయించింది. ఈ నిర్ణయం ప్రకారం జులై 19వ తేదీ నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు నిర్వహించనున్నారు. అయితే, కరోనా వ్యాప్తి నేపథ్యంలో కోవిడ్ ప్రవర్తనా నియమావళి ప్రకారం సభా వ్యవహారాలను కొనసాగించాలని నిర్ణయించారు. సుమారు నెల రోజుల పాటు సాగే ఈ సమావేశాల్లో 20 సిట్టింగ్స్ ఉండనున్నాయి. సాధారణంగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై మూడవ వారంలో ప్రారంభమై.. స్వాతంత్ర్య దినోవత్సవం లోపు పూర్తి అవుతాయి. కానీ, ఈసారి మాత్రం కొద్ది రోజుల ముందుగానే పార్లమెంట్ సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ పార్లమెంట్ సమావేశాలకు కనీసం ఒక డోసు కోవిడ్ టీకా తీసుకున్న వారిని మాత్రమే పార్లమెంట్‌లోకి అనుమతించేలా నిబంధనలు పెట్టారు. దీని ప్రకారం ఎంపీలందరూ ఈ సమావేశాలకు హాజరు కావాలంటే.. కోవిడ్ టీకా తీసుకోవడం తప్పనిసరి.
ఇదిలాఉంటే.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వ విధానాలను ఎండగట్టేందుకు విపక్ష పార్టీలు సిద్ధమవుతున్నాయి. కరోనా వ్యాక్సీన్ కొరత, కరోనాను ఎదుర్కోవడంలో ప్రభుత్వ వైఫల్యాలు, నిత్యావసర ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. మరోవైపు, ప్రతిపక్షాలకు ధీటైన సమాధానం చెప్పేందుకు అధికార పక్షం కూడా రెడీ అవుతోంది. అందుకు సంబంధించి కౌంటర్ అస్త్ర, శస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. మొత్తానికి దేశంలో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో జరుగబోయే ఈ పార్లమెంట్ సమావేశాలు పొలిటికల్ హీట్‌ను అమాంతం పెంచుతాయని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.
Also read:
Narappa Movie: ఓటీటీలోకి వెంకటేష్ “నారప్ప”.. చిత్రయూనిట్‌తో ప్రైమ్ చర్చలు ?… రిలీజ్ ఎప్పుడంటే…