Arvind Kejriwal: మేం ఇక్కడ అధికారంలోకి వస్తే.. పంజాబ్ లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తాయిలాల ‘వర్షం’

పంజాబ్ లో తాము అధికారంలోకి వచ్చిన పక్షంలో రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు 300 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా ఇస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.

Arvind Kejriwal: మేం ఇక్కడ అధికారంలోకి వస్తే.. పంజాబ్ లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తాయిలాల 'వర్షం'
Arvind Kejriwal
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Jun 29, 2021 | 4:08 PM

పంజాబ్ లో తాము అధికారంలోకి వచ్చిన పక్షంలో రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు 300 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా ఇస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. దీనివల్ల ఈ రాష్ట్రంలో 77శాతం నుంచి 80 శాతం వరకు ప్రజలకు విద్యుత్ బిల్లులు చెల్లించే బెడదే ఉండదన్నారు. మంగళవారం చండీ గఢ్ లోని ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇక్కడ పాత కరెంట్ బిల్లుల బకాయిలను కూడా మాఫీ చేస్తామని చెప్పారు. తమ ఢిల్లీలో ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా ఇస్తున్నట్టు ఆయన చెప్పారు. ‘ఇది నేను ఇస్తున్న హామీ.. కెప్టెన్ (అమరేందర్ సింగ్) కాదు.. మా హామీలను నెరవేరుస్తాం…ఆప్ అధికారంలోకి వచ్చిన పక్షంలో తక్షణమే మొట్టమొదట పాత బిల్లులను ఎవరూ చెల్లించకుండా చూస్తాం అని కేజ్రీవాల్ చెప్పారు. పంజాబ్ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. తమ పొరుగున ఉన్న ఈ రాష్ట్రంలో కూడా అధికారాన్ని కైవసం చేసుకునేందుకు ఆప్ తహతహలాడుతోంది. కాగా ఢిల్లీలో లోగడ ఇచ్చిన పలు హామీలను నెరవేర్చడంలో ఆప్ విఫలమైంది. ఎంత సేపూ విద్యుత్ బిల్లుల గురించే కేజ్రీవాల్ మాట్లాడుతున్నారని ఆయన ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు.

2017 లో ఇక్కడ జరిగిన ఎన్నికల్లో 117 సీట్లకు గాను ఆప్ 20 సీట్లను మాత్రం దక్కించుకుంది. 77 స్థానాల్లో గెలుపొంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే ప్రస్తుతం సీఎం అమరేందర్ సింగ్ తీవ్ర అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. ఇది వచ్చే ఎన్నికల్లో ఆప్ కు వరం కావచ్చునని భావిస్తున్నారు. ఇక్కడి ప్రజలు మార్పును కోరుకుంటున్నారని కేజ్రీవాల్ పదేపదే వ్యాఖ్యానిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Chiranjeevi : చిరంజీవి గురించి వచ్చిన వార్తలన్నీ అచ్చి అబద్దం.. ఎఐసిసి, ఎపిసిసి స్పష్టీకరణ

Modern Vaccine: మోడెర్నా వ్యాక్సిన్ దిగుమ‌తికి సిప్లాకు డీసీజీఐ అనుమతి.. భారత్‌లో నాలుగుకు చేరిన కరోనా వ్యాక్సిన్స్

వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే
వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!