Moderna Vaccine: మోడెర్నా వ్యాక్సిన్ దిగుమ‌తికి సిప్లాకు డీసీజీఐ అనుమతి.. భారత్‌లో నాలుగుకు చేరిన కరోనా వ్యాక్సిన్స్

భారత్‌లోకి మరో విదేశీ కరోనా వ్యాక్సిన్‌ వచ్చేసింది. అమెరికాకు చెందిన మోడెర్నా వ్యాక్సిన్‌కు భారత్‌లో అనుమతి లభించింది.

Moderna Vaccine: మోడెర్నా వ్యాక్సిన్ దిగుమ‌తికి సిప్లాకు డీసీజీఐ అనుమతి.. భారత్‌లో నాలుగుకు చేరిన కరోనా వ్యాక్సిన్స్
Follow us

|

Updated on: Jun 29, 2021 | 5:01 PM

Cipla gets Moderna Vaccine: భారత్‌లోకి మరో విదేశీ కరోనా వ్యాక్సిన్‌ వచ్చేసింది. అమెరికాకు చెందిన మోడెర్నా వ్యాక్సిన్‌కు భారత్‌లో అనుమతి లభించింది. మోడెర్నా వ్యాక్సిన్‌ను దిగుమతి చేసుకునేందుకు సిప్లా ఫార్మా కంపెనీకి డ్రగ్స్ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి ఇచ్చింది. మోడెర్నా వ్యాక్సిన్‌ దిగుమతికి మార్కెటింగ్ కోసం సిప్లా దరఖాస్తు చేసుకున్న మరుసటి రోజే డీసీజీఐ అనుమతి లభించింది.

మోడెర్నా టీకాను మెసెంజ‌ర్ RNA టెక్నాలజీతో అభివృద్ది చేశారు. క్లినకల్‌ ట్రయల్స్‌లో ఈ టీకా 90 శాతం సమర్ధవంతంగా పనిచేసింది. అమెరికాతో పాటు యూరప్‌ దేశాల్లో ఎక్కువగా ఫైజర్‌తో పాటు మోడెర్నా టీకానే వినియోగిస్తున్నారు. విదేశాల్లో అనుమతి పొందిన వ్యాక్సిన్లకు భారత్‌లో క్లినికల్‌ ట్రయల్స్‌ అవసరం లేదని కేంద్రం ఇప్పటికే వెల్లడించింది. అమెరికా కంపెనీ మోడెర్నా త‌యారు చేసిన వ్యాక్సిన్ దిగుమ‌తి, అత్యవ‌స‌ర వినియోగానికి మంగ‌ళ‌వారం డీసీజీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సోమ‌వార‌మే ఈ సంస్థ దీనికోసం డీసీజీఐ అనుమ‌తి కోరుతూ ద‌ర‌ఖాస్తు చేసుకుంది. ఇండియాలో క‌రోనా వైర‌స్ కోసం అత్యవ‌స‌ర అనుమ‌తి పొందిన నాలుగో వ్యాక్సిన్ మోడెర్నా కావడం విశేషం. ఇప్పటికే కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌, స్పుత్నిక్ వి ల‌కు డీసీజీఐ అనుమ‌తి ఇచ్చిన విష‌యం తెలిసిందే.

అమెరికాతో పాటు యూరప్‌ దేశాల్లో ఎక్కువగా ఫైజర్‌తో పాటు మోడెర్నా టీకానే వినియోగిస్తున్నారు. విదేశాల్లో అనుమతి పొందిన వ్యాక్సిన్లకు భారత్‌లో క్లినికల్‌ ట్రయల్స్‌ అవసరం లేదని కేంద్రం ఇప్పటికే వెల్లడించింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ టీకా అత్యవసర వినియోగానికి డీసీజీఐ పరిమితులతో కూడిన అనుమతులు మంజూరు చేసింది. టీకా పంపిణీ చేపట్టిన తర్వాత తొలి 100 లబ్ధిదారులకు సంబంధించి 7 రోజుల ఆరోగ్య పరిస్థితిని సంస్థ సమర్పించాల్సి ఉంటుంది అని అధికారిక వర్గాలు తెలిపాయి.

మోడెర్నా వ్యాక్సిన్‌.. భారత్‌లో అందుబాటులోకి వస్తోన్న నాలుగో కరోనా టీకా. స్వదేశీ టీకాలు కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌తో పాటు రష్యాకు చెందిన స్పుత్నిక్‌ వి వ్యాక్సిన్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. భారత్‌లోనూ విదేశీ టీకాలను అందుబాటులోకి తెచ్చేలా ఇటీవల డీసీజీఐ అనుమతి ప్రక్రియల్లో కొన్ని మార్పులు చేసింది. విదేశాల్లో అనుమతులు పొందిన టీకాలు దేశంలో క్లినికల్‌ ప్రయోగాలు నిర్వహించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో మెడెర్నా టీకాను భారత్‌లోకి తీసుకొచ్చేందుకు సిప్లా.. ఆ సంస్థతో ఒప్పందం చేసుకుంది. విదేశీ టీకాలకు అనుమతి విషయంలో నిబంధనలు సడలించినట్టు కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. మిగతా టీకాలకు

Read Also… Indian Parliament: జులై 19వ తేదీ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు..!

Latest Articles
నక్క తోక తొక్కావ్ బ్రో.. సలార్‌లో ప్రభాస్ బైక్ గెలుచుకుంది ఇతనే
నక్క తోక తొక్కావ్ బ్రో.. సలార్‌లో ప్రభాస్ బైక్ గెలుచుకుంది ఇతనే
కడుపు నొప్పితో ఇబ్బంది పడ్డ ఖైదీ.. టెస్టులు చేసిన డాక్టర్లు షాక్
కడుపు నొప్పితో ఇబ్బంది పడ్డ ఖైదీ.. టెస్టులు చేసిన డాక్టర్లు షాక్
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో తెలంగాణ వర్సెస్ ఢిల్లీ పోలీస్..
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో తెలంగాణ వర్సెస్ ఢిల్లీ పోలీస్..
వికెట్ తీసిన భువీ.. కట్‌చేస్తే.. కావ్యాపాప రియాక్షన్ ఫిదానే
వికెట్ తీసిన భువీ.. కట్‌చేస్తే.. కావ్యాపాప రియాక్షన్ ఫిదానే
నడుము నాజూకుగా తీగలా ఉండాలా.. ఈ ఫుడ్స్ బెస్ట్..
నడుము నాజూకుగా తీగలా ఉండాలా.. ఈ ఫుడ్స్ బెస్ట్..
తెలంగాణ 'పది' అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్‌ ఇదే
తెలంగాణ 'పది' అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్‌ ఇదే
షుగర్‌ పేషెంట్స్‌ పుచ్చకాయ తినొచ్చా.? నిపుణులు ఏమంటున్నారు
షుగర్‌ పేషెంట్స్‌ పుచ్చకాయ తినొచ్చా.? నిపుణులు ఏమంటున్నారు
రింకూ సింగ్‌తో రోహిత్ శర్మ.. ఫ్యాన్స్‌ని ఫిదా చేస్తోన్న వీడియో
రింకూ సింగ్‌తో రోహిత్ శర్మ.. ఫ్యాన్స్‌ని ఫిదా చేస్తోన్న వీడియో
నా భార్య నన్ను మరో పెళ్లి చేసుకోమని ఏడ్చింది..
నా భార్య నన్ను మరో పెళ్లి చేసుకోమని ఏడ్చింది..