మొబిక్విక్‌ ఇన్సూరెన్స్ సేవలు రూ.20 లకే ప్రార౦భ౦

మొబిక్విక్‌ ఇన్సూరెన్స్ సేవలు రూ.20 లకే ప్రార౦భ౦

మొబిక్విక్‌ తాజాగా తన యూజర్లకు ఇన్సూరెన్స్ సేవలను ఆవిష్కరించింది. వినియోగదారులకు డిజిటల్‌ జీవిత బీమా (లైఫ్ ఇన్సూరెన్స్) సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని కోసం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. డిజిటల్ లైఫ్ ఇన్సూరెన్స్ సేవల్లో భాగంగా యూజర్లు అతితక్కువగా నెలకు రూ.20 ప్రీమియం చెల్లించి రూ.లక్ష జీవిత బీమా కవరేజ్ పొందొచ్చు. కాగా మొబిక్విక్ గత ఏడాది నవంబరులో డిజిటల్ ప్రమాద బీమా సేవలు ప్రకటించింది. తాజాగా ఇప్పుడు డిజిటల్ ఇన్సూరెన్స్ […]

TV9 Telugu Digital Desk

| Edited By: Ravi Kiran

Sep 01, 2020 | 6:29 PM

మొబిక్విక్‌ తాజాగా తన యూజర్లకు ఇన్సూరెన్స్ సేవలను ఆవిష్కరించింది. వినియోగదారులకు డిజిటల్‌ జీవిత బీమా (లైఫ్ ఇన్సూరెన్స్) సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని కోసం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

డిజిటల్ లైఫ్ ఇన్సూరెన్స్ సేవల్లో భాగంగా యూజర్లు అతితక్కువగా నెలకు రూ.20 ప్రీమియం చెల్లించి రూ.లక్ష జీవిత బీమా కవరేజ్ పొందొచ్చు. కాగా మొబిక్విక్ గత ఏడాది నవంబరులో డిజిటల్ ప్రమాద బీమా సేవలు ప్రకటించింది. తాజాగా ఇప్పుడు డిజిటల్ ఇన్సూరెన్స్ విభాగంలో జీవిత బీమా సేవలను ఆవిష్కరించింది.

తాజా లైఫ్ ఇన్సూరెన్స్ సేవల కింద మూడు రకాల సేవలను అ౦దుబాటులోకి తెచ్చి౦ది. రూ.లక్ష పాలసీకి నెలకు రూ.20 ప్రీమియం, రూ.1.5 లక్షల పాలసీకి నెలకు రూ.30 ప్రీమియం, రూ.2 లక్షల పాలసీకి నెలకు రూ.40 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu