కరోనా కనుమరుగు కావాలంటూ సద్దుల బతుకమ్మ మొక్కులుః కవిత

రాష్ట్ర ప్రజలందరికీ ఎమ్మెల్సీ ‌కల్వకుంట్ల కవిత సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శనివారం వీడియోను విడుదల చేశారు.

కరోనా కనుమరుగు కావాలంటూ సద్దుల బతుకమ్మ మొక్కులుః కవిత
Follow us

|

Updated on: Oct 24, 2020 | 10:55 AM

రాష్ట్ర ప్రజలందరికీ ఎమ్మెల్సీ ‌కల్వకుంట్ల కవిత సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శనివారం వీడియోను విడుదల చేశారు. ప్రతీ సంవత్సరం బతుకమ్మ పండుగ అంటేనే ఎంతో సందడిగా ఉంటుందని, అయితే ప్రస్తుతం కరోనా ‌మహమ్మారి కారణంగా ఎవరింట్లో వాళ్లు, మాస్కులు పెట్టుకుని పండుగను జరుపుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. ‘ఇలాంటి పరిస్థితులలో కూడా ఆడబిడ్డలంతా ఉత్సాహంగా బతుకమ్మ పాటలు నెమరువేసుకుంటూ, యూట్యూబ్‌లో బతుకమ్మ కొత్త పాటలు వింటూ, పెద్దఎత్తున పండుగను జరుపుకుంటున్నట్టు సోషల్ మీడియాలో చూస్తున్నామంటూ కవిత సంతోషం వ్యక్తం చేశారు.

కరోనాను తోడు హైదరాబాద్‌లో అకాల వర్షాలు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన కవిత.. మనమందరం ఒకరికొకరు అండగా నిలవాలన్నారు. అలాగే, సంప్రదాయానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను పరిపూర్ణం చేసుకోవాల్సిన సందర్భం వచ్చిందన్నారు. హైదరాబాద్ ప్రజల ఇబ్బందులు త్వరగా తొలగిపోవాలని, గౌరమ్మ తల్లి దయతో కరోనా కనుమరుగవ్వాలని ఎమ్మెల్సీ కవిత ప్రార్థించారు. ప్రజలందరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలంటూ కవిత పేర్కొన్నారు.