AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా బారిన పడ్డ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి

కరోనా వ్యాప్తి ఆగడం లేదు. సామాన్యులతో ప్రజా ప్రతినిధులను వైరస్ కలవరపెడుతోంది. తాజాగా  నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి  కరోనా బారిన పడ్డారు.

కరోనా బారిన పడ్డ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి
Ram Naramaneni
|

Updated on: Oct 23, 2020 | 7:45 PM

Share

కరోనా వ్యాప్తి ఆగడం లేదు. సామాన్యులతో ప్రజా ప్రతినిధులను వైరస్ కలవరపెడుతోంది. తాజాగా  నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి  కరోనా బారిన పడ్డారు. గత రెండు, మూడు రోజులుగా ఆయన స్వల్ప అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. దీంతో హైదరాబాద్‌లో కోవిడ్ టెస్ట్  చేయించుకోగా ఫలితం పాజిటివ్‌గా తేలింది. దీంతో ఎమ్మెల్యే హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తానకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని… పెద్దగా ఇబ్బందులు లేవని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. గత వారం రోజుల్లో తనను కలిసిన వారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని, జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 1,412 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2,29,001 కు చేరింది. 24 గంటల్లో 6 మంది కరోనా బారిన పడి మరణించగా.. మృతుల సంఖ్య 1,298 చేరింది. ఇక కరోనా నుంచి తాజాగా 1,221 మంది డిశ్చార్జ్‌ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 2,07,326 కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 20,377 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Also Read :

కృష్ణా జిల్లాలో విషాదం, కరెంట్ షాక్‌తో ఇద్దరు కూలీలు మృతి

ఢిల్లీలో ప్రమాదకరంగా వాయు కాలుష్యం

Follow Us