‘అస్సెట్‌ ప్రొటెక్షన్‌ సెల్‌’ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

జీహెచ్ఎంసీ పరిథిలో అక్రమణలను అరికట్టేందుకు గ్రేటర్ అధికారులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. దీనికోసం జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ‘అస్సెట్‌ ప్రొటెక్షన్‌ సెల్‌’ ను ఏర్పాటైంది. అస్సెట్‌ ప్రొటెక్షన్‌ టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800 599 0099ను ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు.

  • Balaraju Goud
  • Publish Date - 2:47 pm, Sun, 5 July 20
‘అస్సెట్‌ ప్రొటెక్షన్‌ సెల్‌’ ను  ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్‌ మహానగరంలో అన్యాక్రాంతమవుతున్న అస్తుల పరిరక్షణకు తెలంగాణ సర్కార్ శ్రీకారం చుట్టుంది. జీహెచ్ఎంసీ పరిథిలో అక్రమణలను అరికట్టేందుకు గ్రేటర్ అధికారులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. దీనికోసం జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ‘అస్సెట్‌ ప్రొటెక్షన్‌ సెల్‌’ ను ఏర్పాటైంది. అస్సెట్‌ ప్రొటెక్షన్‌ టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800 599 0099ను ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. నగరంలోని ప్రభుత్వ ఆస్తుల రక్షణకు ప్రజల సహకారం కావాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు. చెరువులు, పార్కులు, బహిరంగస్థలాల్లో కబ్జాకు పాల్పడినా, ప్రైవేట్ కార్యకలాపాలకు పాల్పడిన ప్రభుత్వానికి తెలిపేలా టోల్‌ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేసింది. అన్ని పనిదినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అస్సెట్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ పనిచేయనుంది. జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, విజిలెన్స్‌, విపత్తు నిర్వహణ విభాగం ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. ప్రజలు తమ దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్ని టోల్ ఫ్రీ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు.