మూడు నెల‌ల త‌ర్వాత‌ ఛిల్ అయిన ఇంగ్లాండ్ ప్ర‌జ‌లు..

కరోనావైరస్ ఆంక్షలు సడలించిన నేప‌థ్యంలో, ఇంగ్లాండ్ ప్రజలు మూడు నెలల త‌ర్వాత కాస్త ఛిల్ చేశారు. ఆతిథ్య వేదికలైన పబ్‌లు, రెస్టారెంట్‌లతో పాటు క్షౌరశాలలు, సినిమాస్, థీమ్ పార్కులు కఠినమైన భౌతిక‌ దూర నిబంధనలతో తిరిగి ప్రారంభ‌మ‌య్యాయి.

  • Ram Naramaneni
  • Publish Date - 2:35 pm, Sun, 5 July 20
మూడు నెల‌ల త‌ర్వాత‌ ఛిల్ అయిన ఇంగ్లాండ్ ప్ర‌జ‌లు..

కరోనావైరస్ ఆంక్షలు సడలించిన నేప‌థ్యంలో, ఇంగ్లాండ్ ప్రజలు మూడు నెలల త‌ర్వాత కాస్త ఛిల్ చేశారు. ఆతిథ్య వేదికలైన పబ్‌లు, రెస్టారెంట్‌లతో పాటు క్షౌరశాలలు, సినిమాస్, థీమ్ పార్కులు కఠినమైన భౌతిక‌ దూర నిబంధనలతో తిరిగి ప్రారంభ‌మ‌య్యాయి. కానీ ప్ర‌స్తుతం స‌మ‌యం మ‌రింత ప్ర‌మాద‌క‌ర‌మైంద‌ని, ప్ర‌జ‌లు అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాలని ఇంగ్లాండ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ సూచించారు. ఈ క్ర‌మంలో దేశంలోని బిల్డింగులు, మైలు రాళ్లు లైట్ల‌తో అలంక‌రించారు. వైరస్ కారణంగా మరణించిన వారిని జ్ఞాపకం చేసుకోవడానికి శనివారం ఇంటి కిటికీలో లైట్లు ఉంచాలని ప్రజలకు పిలుపునిచ్చారు అధికారులు.

ఈ క్ర‌మంలో డౌనింగ్ స్ట్రీట్ నీలం రంగులో వెలిగిపోగా..రాయల్ ఆల్బర్ట్ హాల్, బ్లాక్పూల్ టవర్, షార్డ్, వెంబ్లీ ఆర్చ్ వంటి ఇతర బహిరంగ భవనాలు కూడా ప్రకాశించాయి. స్కాట్లాండ్, వేల్స్లో.. ఆతిథ్య రంగంపై ఆంక్షలు అమలులో ఉండగా.. ఉత్తర ఐర్లాండ్‌లో శుక్రవారం నుండి పబ్బులు తెరవగలిగారు. పరిమితుల సడలింపు ఉన్నప్పటికీ, భద్రత, భయం, భౌతిక‌ దూర మార్గదర్శకత్వాన్ని ఎలా అమలు చేయాలనే దానిపై ఆందోళనల మధ్య 30% బార్లు, పబ్బులు, రెస్టారెంట్లు మూసివేయబడ్డాయి.