బాలయ్యకు ‘ఆమె’ ఓకే చెప్తుందా..!

నందమూరి బాలకృష్ణతో బోయపాటి శ్రీను ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ ముందు సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం ఇప్పటికే ఓ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది.

  • Updated On - 3:15 pm, Sun, 5 July 20 Edited By:
బాలయ్యకు 'ఆమె' ఓకే చెప్తుందా..!

నందమూరి బాలకృష్ణతో బోయపాటి శ్రీను ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ ముందు సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం ఇప్పటికే ఓ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఇక కరోనా పరిస్థితులు కాస్త సర్దుకున్నాక ఈ మూవీ షూటింగ్‌ని తిరిగి ప్రారంభించాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీలో హీరోయిన్‌గా పలువురి పేర్లు వినిపించాయి. అయితే ఎవ్వరూ ఫైనల్ అవ్వలేదు. ఇక ఆ మధ్యన ఓ సందర్భంలో మాట్లాడిన బోయపాటి.. ఈ మూవీ ద్వారా కొత్త హీరోయిన్‌ను టాలీవుడ్‌కి పరిచయం చేస్తామని అన్నారు.

అయితే తాజా సమాచారం ప్రకారం ఇందులో హీరోయిన్‌గా నటి అమలాపాల్‌ను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సెకండ్ ఇన్నింగ్స్‌లో సెలక్టివ్‌గా సినిమాలు చేసుకుంటూ పోతున్న అమల.. ఇంతవరకు తెలుగులో ఒక్క సినిమాకు కూడా ఓకే చెప్పలేదు. మరి బాలయ్య మూవీకి ఆమె ఓకే చెప్తుందో లేదో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.