ఏపీలో కొత్తగా 998 కేసులు.. ఒక్క రోజే 14 మంది మృతి..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇవాళ కొత్తగా 998 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. అలాగే ఒక్క రోజే 14 మంది మృతి చెందారు. కోవిడ్ వల్ల కర్నూలులో 5, అనంతపూర్‌లో 3, చిత్తూరులో 2, కడపలో ..

ఏపీలో కొత్తగా 998 కేసులు.. ఒక్క రోజే 14 మంది మృతి..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 05, 2020 | 2:53 PM

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇవాళ కొత్తగా 998 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. అలాగే ఒక్క రోజే 14 మంది మృతి చెందారు. కోవిడ్ వల్ల కర్నూలులో 5, అనంతపూర్‌లో 3, చిత్తూరులో 2, కడపలో 2, కృష్ణలో ఒకరు, విశాఖ పట్నంలో ఒకరు మరణించారు. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కేసుల సంఖ్య 18,697కి చేరింది. అలాగే ఇప్పటివరకూ 232 మంది మృతి చెందారు. ఇందులో 10,043 యాక్టివ్ కేసులు ఉండగా, ఇక 8,422 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఆదివారం కొత్తగా నమోదైన కేసుల్లో అనంతపురం 87, చిత్తూరు 74, ఈస్ట్ గోదావరి 118, గుంటూరు 157, కడప 52, కృష్ణ 62, కర్నూలు 97, నెల్లూరు 45, ప్రకాశం 27, శ్రీకాకుళం 96, విశాఖపట్నం 88, విజయనగరం 18, వెస్ట్ గోదావరిలో 40 కేసులు నమోదయ్యాయి.

Read More: 

బ్రేకింగ్: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో ప్రధాని భేటీ