ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్ ఆస్పత్రి ఢిల్లీలో..
ప్రపంచంలోనే అతి పెద్ద కోవిడ్ ఆస్పత్రిని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ప్రారంభించారు. ఢిల్లీ ఛత్తర్‌పుర్ రాధా స్వామి సత్సంగ్ బియాస్ ప్రాంతంలో.. పది వేల పడకల సామర్థ్యంతో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. 20 ఫుట్ బాల్ మైదానాలంత విస్తీర్ణంలో 200 ఎన్‌క్లోజర్స్‌తో ఈ కోవిడ్ కేర్ ఆస్పత్రిని...
ప్రపంచంలోనే అతి పెద్ద కోవిడ్ ఆస్పత్రిని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ప్రారంభించారు. ఢిల్లీ ఛత్తర్‌పుర్ రాధా స్వామి సత్సంగ్ బియాస్ ప్రాంతంలో.. పది వేల పడకల సామర్థ్యంతో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. 20 ఫుట్ బాల్ మైదానాలంత విస్తీర్ణంలో 200 ఎన్‌క్లోజర్స్‌తో ఈ కోవిడ్ కేర్ ఆస్పత్రిని నిర్మించారు. దాదాపు 1700 అడుగుల పొడవు, 700 అడుగుల వెడల్పు ఉంటుంది ఈ కేంద్రం. ఒక్కో ఎన్‌క్లోజర్‌లో 50 పడకలను ఏర్పాటు చేవారు. వ్యాధి లక్షణాలు లేని కరోనా రోగులకు, తక్కువ తీవ్రత ఉన్న బాధితులకు ఇక్కడ చికిత్స అందిస్తారు.
దేశ రాజధానిలో ఢిల్లీలో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రక్షణ పరిశోధనా అభివృద్ది సంస్థ (డీఆర్‌డీఏ) 11 రోజుల్లోనే తాత్కాలిక కరోనా ఆస్పత్రిని నిర్మించింది. ఈ ఆస్పత్రిలో 250 ఐసీయూ పడకలు సహా మొత్తం వెయ్యి పడకలు ఏర్పాటు చేశారు. అలాగే దీనికి ‘సర్దార్ పటేల్ కోవిడ్ కేర్ సెంటర్ అండ్ హాస్పిటల్’ అని పేరు పెట్టారు.
చైనా ఆస్పత్రి కన్నా పది రెట్లు పెద్దది..
చైనాలో నిర్మించిన కోవిడ్ ప్రత్యేక ఆస్పత్రి కంటే ఢిల్లీలోని ఈ హాస్పిటల్ పదింతలు పెద్దది కావడం విశేషం. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో దీన్ని ఏర్పాటు చేశారు అధికారులు. కాగా ఈ కోవిడ్ కేంద్రాన్ని ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు పలువురు కేంద్ర మంత్రులు కూడా పరిశీలించారు.
Read More: