అక్కడి మెడికల్ కళాశాలల డిగ్రీలు చెల్లవు: ఎంసీఐ
పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ-కాశ్మీర్, లడఖ్ లోని మెడికల్ కాలేజీల నుండి పొందిన మెడికల్ డిగ్రీలు చెల్లుబాటు కావని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసిఐ) తెలిపింది. కశ్మీర్ యువతకు 1600 స్కాలర్‌షిప్‌లు ఇచ్చేందుకు
పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ-కాశ్మీర్, లడఖ్ లోని మెడికల్ కాలేజీల నుండి పొందిన మెడికల్ డిగ్రీలు చెల్లుబాటు కావని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసిఐ) తెలిపింది. కశ్మీర్ యువతకు 1600 స్కాలర్‌షిప్‌లు ఇచ్చేందుకు పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ప్రకటించిన పథకాన్ని కూడా భారత ప్రభుత్వం తిరస్కరించింది. పీవోకే మెడికల్ డిగ్రీలపై వైఖరి తెలుపాలని 2019 డిసెంబర్‌లో ఎంసీఐ, విదేశాంగశాఖను జమ్ముకశ్మీర్ హైకోర్టు ఆదేశించటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్, లడఖ్ లోని వైద్య సంస్థకు ఐఎంసి చట్టం, 1956 ప్రకారం అనుమతి / గుర్తింపు అవసరం. “పిఒజెకెఎల్ లోని ఏ మెడికల్ కాలేజీకి ఇటువంటి అనుమతి ఇవ్వబడలేదు” అని ఎంసిఐ స్పష్టంచేసింది.
Also Read: హెల్మెట్‌లకు బీఐఎస్ లేకుంటే ఇక బాదుడే!