ఇమ్రాన్‌ఖాన్ కరోనా వైరస్‌లాంటివారు : మరియం ఘాటు వ్యాఖ్యలు
పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ను కరోనా వైరస్‌తో పోల్చారు ముస్లింలీగ్ నవాజ్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ మరియమ్ నవాజ్.. ప్రస్తుతం ఆ పార్టీ బాధ్యతలను మోస్తున్న మరియం మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కూతురన్న విషయం తెలిసిందే! ఇమ్రాన్‌ఖాన్‌నే కాదు, ఆయన పార్టీ పాకిస్తాన్ తెహరిక్ ఎ ఇన్సాఫ్‌ను కూడా తిట్టిపోశారు.. కరోనా మహమ్మారి కంటే డేంజరన్నారు.. గిల్గిత్ బాల్టిస్తాన్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది ప్రపంచమంతటా కరోనా వైరస్ వ్యాపించిందని, […]
పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ను కరోనా వైరస్‌తో పోల్చారు ముస్లింలీగ్ నవాజ్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ మరియమ్ నవాజ్.. ప్రస్తుతం ఆ పార్టీ బాధ్యతలను మోస్తున్న మరియం మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కూతురన్న విషయం తెలిసిందే! ఇమ్రాన్‌ఖాన్‌నే కాదు, ఆయన పార్టీ పాకిస్తాన్ తెహరిక్ ఎ ఇన్సాఫ్‌ను కూడా తిట్టిపోశారు.. కరోనా మహమ్మారి కంటే డేంజరన్నారు.. గిల్గిత్ బాల్టిస్తాన్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది ప్రపంచమంతటా కరోనా వైరస్ వ్యాపించిందని, పాకిస్తాన్‌లో మాత్రం 2018లోనే వైరస్ వచ్చిందని మరియం అన్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను మాస్క్‌తో నియంత్రించవచ్చు కానీ పాకిస్తాన్‌లో రెండేళ్ల కిందట వచ్చిన కరోనా వైరస్‌కు ఎలాంటి మాస్క్‌లు పనిచేయవంటూ పరోక్షంగా ఇమ్రాన్‌ఖాన్, ఆయన పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌కు పట్టిన కరోనా వైరస్‌ను తరిమికొట్టాలంటే ఒకే ఒక్క సొల్యూషన్ ఉందని, ఆ సొల్యూషనే నవాజ్‌షరీఫ్ అని మరియం అన్నారు. వచ్చే ఆదివారం జరిగే ఎన్నికలలో గిల్గిత్ బాల్టిస్తాన్ మహిళలు ముస్లింలీగ్-నవాజ్ పార్టీకి ఓటు వేయాలని కోరారు.