హరీష్ రావు దత్తత గ్రామంలో కమలానిక అధిక్యత

టీఆర్ఎస్, కాంగ్రెస్‌లోని ముఖ్య నేతలు ప్రాతినిథ్యం వహించిన గ్రామాల్లో సైతం బీజేపీనే పైచేయి సాధించి సంచలనం సృష్టిస్తోంది.

Balaraju Goud

|

Nov 10, 2020 | 2:28 PM

సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం దోబూచులాడుతోంది. మరోవైపు దుబ్బాక ఎన్నికలను టీఆర్ఎస్ ప్రచారం నిర్వహించిన రాష్ట్ర మంత్రి హరీష్‌కు ఝలక్ ఇచ్చింది. ఆయన దత్తత గ్రామంలోనూ బీజేపీ సత్తా చాటుతుండడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ముఖ్యంగా టీఆర్ఎస్, కాంగ్రెస్‌లోని ముఖ్య నేతలు ప్రాతినిథ్యం వహించిన గ్రామాల్లో సైతం బీజేపీనే పైచేయి సాధించి సంచలనం సృష్టిస్తోంది. ట్రబుల్ షూటర్‌గా, ఉపఎన్నికల కింగ్‌గా పేరు గాంచిన మంత్రి హరీష్ రావు దత్తత గ్రామంలో సైతం భారతీయ జనతాపార్టీ అభ్యర్థి రఘునందన్ రావు ఆధిక్యం కనబరచారు. హరీష్ రావు దత్తత గ్రామం చీకోడులో బీజేపీ 22 ఓట్ల ఆధిక్యం సాధించారు.

ఉదయం నుంచి ఇప్పటి వరకు పూర్తైన ఓట్ల కౌంటింగ్‌లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆధిక్యంలో ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయానికి 14 రౌండ్ల కౌంటింగ్ పూర్తి కాగా.. 13వ రౌండులో టీఆర్ఎస్ ఆధిక్యంలోకి దూసుకొచ్చింది. ఈ రౌండ్‌లో టీఆర్ఎస్ పార్టీకి 304 ఓట్ల ఆధిక్యం లభించింది. దీంతో 16 రౌండ్లు పూర్తి అయ్యేసరికి టీఆర్ఎస్ అధిక్యతను కనబరుస్తుంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu