‘యాత్ర’ అయిపోంది.. ఇప్పుడు ‘పాదయాత్ర’ మొదలైంది
మలయాళ స్టార్ మమ్ముట్టి 'పాదయాత్ర' పేరుతో అదూర్ గోపాలకృష్ణన్ దర్శకత్వంలో కొత్త సినిమా ప్రకటించారు. గతంలో 'యాత్ర' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న మమ్ముట్టి, వైఎస్సార్ పాత్రలో మెప్పించారు. తాజాగా జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రకటనతో, మమ్ముట్టి సినిమాపై రాజకీయ చర్చ మొదలైంది. మలయాళ చిత్రమైనా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది.
ఆఫ్టర్ షార్ట్ బ్రేక్.. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి వరుస సినిమాలు చేస్తున్నాడు. మంచి విజయాలను అందుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఈయన తన నెక్ట్స్ సినిమాను అనౌన్స్ చేశాడు. మలయాళం స్టార్ రచయిత కమ్ దర్శకుడు అదూర్ గోపాలకృష్ణన్ దర్శకత్వంలో… ‘పాదయాత్ర’ పేరుతో మూవీ చేస్తున్నట్టు అనౌన్స్ చేశాడు. ఈ కారణంగా ఇప్పుడు ఉన్నట్టుండి తెలుగు టూ స్టేట్స్లో హాట్ టాపిక్ అవుతున్నాడు మమూకా..! గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితకథలోని కొంతభాగం ఆధారంగా తెరెక్కిన యాత్ర, యాత్ర2 సినిమాల్లో మమ్ముట్టి నటించాడు. తన పర్ఫార్మెన్స్తో తెలుగు ప్రేక్షకులను ఆక్టకున్నాడు. పొలిటికల్ హాట్ కు కూడా కారణం అయ్యాడు. అలాంటి ఈయన ఇప్పుడు పాదయాత్ర పేరుతో మరో సినిమా చేయబోతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. ఓ పోస్టర్‌ను కూడా షేర్ చేశాడు. రెండు రోజుల క్రితం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి త్వరలో పాదయాత్ర చేస్తానంటూ ప్రకటించారు. ఇప్పుడు మమ్ముట్టి పాదయాత్ర పేరుతో సినిమా ప్రకటించడంతో.. ఈ రెండింటినీ పోల్చుతూ.. కొందరు నెటిజన్లు .. సోషల్ మీడియాలో దీన్నో చర్చగా మార్చారు. అయితే ఈ సినిమాను తెరకెక్కిస్తున్న అదూర్ గోపాలకృష్ణన్ … ఓ మలయాళ దర్శకుడు కావడంతో ఇది మలయాళ సినిమా అని, ఏపీ రాజకీయాలకు సంబంధం ఉండదని మరొ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే వీరందరి కామెంట్స్ పక్కు పెడితే.. ఇప్పుడు అందరి కళ్లు మాత్రం ఈ సినిమాపై ఉన్నట్టు తెలుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jana Nayagan: జననాయగన్‌కు అమెజాన్ 120 కోట్ల దెబ్బ ??
Renu Desai: మరో జన్మ వరకు ఎందుకు ?? ఈ జన్మలోనే అన్నీ క్లియర్ చేస్తా
Mega158: ‘జన నాయగన్’ ఎఫెక్ట్.. చిక్కుల్లో చిరు నెక్స్ట్ మూవీ ??
రాజా సాబ్ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారంటూ.. సైబర్ పోలీసులకు SKN ఫిర్యాదు
Anil Ravipudi: అసాధ్యుడువయ్యా… అర్థ రూపాయితో పది రూపాయలు కొట్టేశావ్ మరి
పోలీసుల కళ్ళకు ఏఐ గ్లాసెస్.. క్షణాల్లో వారిని పట్టేస్తుంది
భూతల స్వర్గం.. కశ్మీర్ సొగసు చూడతరమా
జైలుకెళ్లిన భర్తను బెయిలుపై బయటకు తెచ్చి మరీ
పోలీస్ స్టేషన్కు చేరిన చిలక పంచాయితీ
రూ. 78 లక్షల హాస్పిటల్ బిల్లును.. రూ.21 లక్షలకు తగ్గించిన AI
'మద' ఏనుగు బీభత్సం.. దాడుల్లో 22 మంది హతం
బరువు తగ్గాలని ఆ పౌడర్ తిని.. అంతలోనే అనంతలోకాలకు

