AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NBK111 ముహూర్తం ఫిక్స్.. ఈసారి ప్లాన్ మామూలుగా లేదు

NBK111 ముహూర్తం ఫిక్స్.. ఈసారి ప్లాన్ మామూలుగా లేదు

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: |

Updated on: Jan 25, 2026 | 9:23 PM

Share

NBK111 సినిమాపై తాజా అప్‌డేట్. బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో రానున్న ఈ చిత్రం మొదట చారిత్రక కథగా ప్లాన్ చేసినా, ఇప్పుడు పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనుంది. బడ్జెట్, సమయం కారణాలతో కథ మార్పు జరిగింది. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. 2026 దసరా లేదా 2027 సంక్రాంతికి సినిమా విడుదల కానుంది.

అఖండ 2 తర్వాత చిన్న బ్రేక్ ఇచ్చారు బాలయ్య. నెక్ట్స్ సినిమా లాకైనా.. దర్శక నిర్మాతలు కన్ఫర్మ్ అయినా షూటింగ్ ఎప్పుడో చెప్పలేదు. జనవరిలోనే మొదలవుతుందనుకున్నా కాలేదు. మరి NBK111 సెట్స్‌పైకి వచ్చేది ఎప్పుడు..? హిస్టారికల్ సినిమాతోనే రానున్నారా లేదంటే పక్కా కమర్షియల్ బొమ్మతో పలకరించబోతున్నారా..? అఖండ 2 తర్వాత బాలయ్య ఫోకస్ అంతా ఇప్పుడు గోపీచంద్ మలినేని సినిమాపైనే ఉంది. వీరసింహారెడ్డి తర్వాత ఈ కాంబో రిపీట్ అవుతుంది. చారిత్రక నేపథ్యంతో ఈ సినిమాను ముందు ప్లాన్ చేసినా.. తాజాగా కొత్త కథతో వస్తున్నారు. కొన్ని అనివార్య కారణాలతో ముందు అనుకున్న కథ కాకుండా.. న్యూ స్టోరీతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమయ్యారు మేకర్స్. పెద్ది సినిమాను నిర్మిస్తున్న విృద్ధి సినిమాస్ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో NBK111 రానుంది. అఖండ 2 ఫలితం కూడా కథ మార్పుకి కారణం అయ్యుండొచ్చు. ఇప్పటికే కథ లాక్ అయిపోయింది.. నెరేషన్ కూడా అయిపోయింది. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. బాలయ్య ఈ సినిమా కోసం బాగానే మేకోవర్ అవుతున్నారు. ఈసారి మీ అంచనాలకు మించి సినిమా ఉంటుందంటూ ఊరిస్తున్నారు గోపీచంద్ మలినేని. పైగా హిస్టారికల్ సినిమా అంటే బడ్జెట్ కంట్రోల్ కష్టం.. షూటింగ్‌కు ఎక్కువ టైమ్ కావాలి.. ఈ లెక్కలు వేసుకున్నాకే కమర్షియల్ కథ వైపు వెళ్తున్నారు మేకర్స్. అన్నీ కుదిర్తే 2026 దసరా లేదంటే 2027 సంక్రాంతికి NBK111 విడుదల కానుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘యాత్ర’ అయిపోంది.. ఇప్పుడు ‘పాదయాత్ర’ మొదలైంది

Jana Nayagan: జననాయగన్‌కు అమెజాన్ 120 కోట్ల దెబ్బ ??

Renu Desai: మరో జన్మ వరకు ఎందుకు ?? ఈ జన్మలోనే అన్నీ క్లియర్ చేస్తా

Mega158: ‘జన నాయగన్‌’ ఎఫెక్ట్.. చిక్కుల్లో చిరు నెక్స్ట్‌ మూవీ ??

రాజా సాబ్ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారంటూ.. సైబర్‌ పోలీసులకు SKN ఫిర్యాదు