Jana Nayagan: జననాయగన్‌కు అమెజాన్ 120 కోట్ల దెబ్బ ??
జన నాయగన్ సినిమా విడుదల సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సంక్రాంతికి రావాల్సిన ఈ మూవీ సెన్సార్‌తో వాయిదా పడి, నిర్మాతలు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. 120 కోట్లకు OTT హక్కులు కొన్న అమెజాన్ ప్రైమ్, సినిమా విడుదల కాకపోవడంతో నిర్మాతలపై ఒత్తిడి పెంచుతోంది. ఒప్పందం ఉల్లంఘనపై లీగల్ చర్యలు లేదా నష్టపరిహారం కోరేందుకు సిద్ధమవుతుండటంతో, జన నాయగన్ మరోసారి కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
జన నాయగన్ ఇబ్బందులు ఇప్పట్లో తీరేలా లేవు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కావాల్సి ఉంది. అయితే, సెన్సార్ సమస్య ల కారణంగా ఈ మూవీ అనూహ్యంగా వాయిదా పడింది. ఇప్పటికీ ఈ మూవీ నిర్మాతలు కోర్టు చుట్టూనే తిరుగుతున్నారు. దీంతో జన నాయగన్ సినిమా విడుదలయితే చాలు అనే స్థితిలో అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడీ మూవీకి OTT ప్లాట్‌ఫామ్ నుంచి ఓ కొత్త ఇబ్బంది ఎదురవుతోందని తెలుస్తోంది. దీంతో మరో సారి జననాగన్ కోలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ‘జన నాయగన్’ OTT స్ట్రీమింగ్ హక్కులను 120 కోట్ల రూపాలయలకు సొంతం చేసుకుంది. ఈక్రమంలోనే జననాయగన్ స్ట్రీమింగ్ డేట్‌ను కూడా ఫిక్స్ చేసేసింది. కానీ స్టిల్ ఈ సినిమా రిలీజ్ విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. దీంతో OTT కంపెనీ నుంచి ఈ మూవీ నిర్మాతలపై ఒత్తిడి పెరుగుతుందని సమాచారం. అంతేకాదు ఒప్పందం ప్రకారం ఈ మూవీని రిలీజ్ చేయని పక్షంలో.. నిర్మాతలపై చట్టపరమైన చర్చలు తీసుకుంటామంటూ ఓటీటీ సంస్థ హెచ్చరిస్తున్నట్టు లేదా.. భారీ మొత్తంలో నష్టపరిహారాన్ని వసూలు చేసేందుకు రెడీ అవుతున్నట్టు టాక్. దీంతో ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందిప్పుడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Renu Desai: మరో జన్మ వరకు ఎందుకు ?? ఈ జన్మలోనే అన్నీ క్లియర్ చేస్తా
Mega158: ‘జన నాయగన్’ ఎఫెక్ట్.. చిక్కుల్లో చిరు నెక్స్ట్ మూవీ ??
రాజా సాబ్ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారంటూ.. సైబర్ పోలీసులకు SKN ఫిర్యాదు
Anil Ravipudi: అసాధ్యుడువయ్యా… అర్థ రూపాయితో పది రూపాయలు కొట్టేశావ్ మరి
పోలీసుల కళ్ళకు ఏఐ గ్లాసెస్.. క్షణాల్లో వారిని పట్టేస్తుంది
భూతల స్వర్గం.. కశ్మీర్ సొగసు చూడతరమా
జైలుకెళ్లిన భర్తను బెయిలుపై బయటకు తెచ్చి మరీ
పోలీస్ స్టేషన్కు చేరిన చిలక పంచాయితీ
రూ. 78 లక్షల హాస్పిటల్ బిల్లును.. రూ.21 లక్షలకు తగ్గించిన AI
'మద' ఏనుగు బీభత్సం.. దాడుల్లో 22 మంది హతం
బరువు తగ్గాలని ఆ పౌడర్ తిని.. అంతలోనే అనంతలోకాలకు

