రామ్​ కొణిదెల..నయా రికార్డ్ !

రామ్​ కొణిదెల..నయా రికార్డ్ !

మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగాపవర్ స్టార్ రామ్‌ చరణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా‌ సోషల్‌ మీడియాలో కూడా తన మార్క్ చూపిస్తున్నాడు చెర్రీ. 

Ram Naramaneni

|

Nov 10, 2020 | 2:40 PM

మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగాపవర్ స్టార్ రామ్‌ చరణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా‌ సోషల్‌ మీడియాలో కూడా తన మార్క్ చూపిస్తున్నాడు చెర్రీ.  అతి తక్కువ కాలంలో ట్విట్టర్​లో మిలియన్‌ ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్న స్టార్‌గా అరుదైన రికార్డు సృష్టించాడు. కేవలం 233 రోజుల్లో ఈ ఘనత సాధించిన తొలి తెలుగు హీరో రామ్ చరణ్. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇంత వేగంగా మిలియన్‌ ఫాలోవర్స్‌ను ఏ స్టార్ హీరో‌ సాధించలేదట. చరణ్‌ ఈ ఏడాది మార్చిలో ట్విట్టర్ ఖాతా ప్రారంభించారు. కాగా తన ట్విట్టర్ ఖాతాలో చెర్రీ మాత్రం  తండ్రి చిరంజీవి, బాబాయి పవన్‌ కల్యాణ్‌లను మాత్రమే ఫాలో అవుతున్నారు‌.

ప్రస్తుతం చరణ్ దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న ఆర్ఆర్ఆర్​లో నటిస్తున్నాడు. ఎన్టీఆర్‌ మరో హీరో. ఇందులో అల్లూరి సీతారామరాజుగా చెర్రీ, కొమురం భీమ్‌గా తారక్‌ కనిపించనున్నారు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి జక్కన్న ప్లాన్   చేస్తున్నాడు. అలాగే చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’లో చెరణ్ గెస్ట్ రోల్‌లో సందడి చేయబోతున్నారు.

Also Read : స్కూల్ బస్సులు, ఆటోలకు కరోనా నిబంధనలు విధించిన ఏపీ సర్కార్

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu