ఎట్టకేలకు ఆ దేశాన్ని కూడా తాకిన కరోనా.. మార్షల్‌ దీవుల్లో తొలి కేసు

Balaraju Goud

Balaraju Goud |

Updated on: Oct 30, 2020 | 8:32 AM

చైనాలో పుట్టిన కరోనా పురుగు ప్రపంచ దేశాలను చుట్టేసింది. దాదాపు అన్ని దేశాలు ఈ వైరస్‌ బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. యూరప్ లోని కొన్ని దేశాల్లో మరోసారి దాని ఉద్ధృతి తిరిగి ప్రారంభం అవుతోంది.

ఎట్టకేలకు ఆ దేశాన్ని కూడా తాకిన కరోనా.. మార్షల్‌ దీవుల్లో తొలి కేసు

చైనాలో పుట్టిన కరోనా పురుగు ప్రపంచ దేశాలను చుట్టేసింది. దాదాపు అన్ని దేశాలు ఈ వైరస్‌ బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. యూరప్ లోని కొన్ని దేశాల్లో మరోసారి దాని ఉద్ధృతి తిరిగి ప్రారంభం అవుతోంది. మాస్కులు ధరించడం, భౌతిక దూరం, శానిటైజర్లు వాడకం వైరస్‌ను కట్టడి చేస్తున్నా.. టీకా వచ్చే వరకూ అజాగ్రత్తగా ఉంటే ప్రమాదం పొంచి ఉన్నట్లే అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇదిలావుంటే, ప్రపంచవ్యాప్తంగా కొన్ని చిన్న దేశాలు, దీవులు ఇప్పటికీ కొవిడ్‌ వైరస్‌ దూరంగా ఉన్నాయి. కొవిడ్ నియంత్రణకు పక్కా ఫ్లాన్ చేసుకోవడంతో మాయదారి రోగాన్ని దరిదాపులకు రాకుండా జాగ్రత్త పడ్డారు. అలాంటి వాటిలో సమోవా, టోంగా, నౌరు, మార్షల్‌ దీవులు ముందు వరుసలో ఉన్నాయి. ఇప్పుడా అయా దీవుల్లో కరోనా కలవరాన్ని సృష్టిస్తోంది.

తాజాగా మార్షల్‌ దీవుల్లో రెండు కరోనా కేసులు వెలుగుచూశాయి. కొవిడ్‌ మహమ్మారి దాడి ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకూ కరోనా రహితంగా ఉన్న ఈ దీవుల్లో ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని ఆ దేశ అధికారులు ప్రకటించారు. ఈ దీవుల్లోని ఖ్వజాలిన్‌ అటోల్‌ ప్రాంతంలోని యూఎస్‌ మిలటరీ బేస్‌లో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వీళ్లిద్దరూ ఒకే విమానంలో ఈ ప్రాంతానికి చేరుకున్నట్లు అక్కడి అధికారులు నిర్ధారించారు. అక్టోబరు 27న ఈ ఇద్దరు వ్యక్తులు యూఎస్‌ఏలోని హవాయి ప్రాంతం నుంచి వచ్చినట్లు గుర్తించారు. వీళ్ల ద్వారా ఇతరులెవరికీ కరోనా వ్యాప్తి చెందలేదని వివరించిన అధికారులు కరోనా కట్టడికి కొత్త నిబంధనలేమీ అమలు చేయడం లేదని పేర్కొన్నారు. ముందు జాగ్రత్తగా విదేశీల ప్రయాణాలపై నిఘా పెడుతున్నట్లు అధికారులు తెలిపారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu