Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణలో కూడా కరోనాకు నాటుమందు.. రిస్క్ తీసుకోవద్దని హెచ్చరించిన పోలీసులు!

మంచిర్యాల జిల్లా మందమర్రి గ్రామానికి చెందిన బచ్చలి భీమయ్య అనే వ్యక్తి కోవిడ్‌కు నాటుమందు ఇస్తున్నాడని తెలియడంతో జనం నెమ్మదిగా అక్కడికి చేరుకుంటున్నారు.  ఆయన పూర్వీకులు కూడా...

తెలంగాణలో కూడా కరోనాకు నాటుమందు.. రిస్క్ తీసుకోవద్దని హెచ్చరించిన పోలీసులు!
Mandamarri Corona Mandhu
Follow us
Sanjay Kasula

|

Updated on: May 27, 2021 | 2:35 PM

నెల్లూరు జిల్లాలో ఆనందయ్య ఇస్తున్న కరోనా నాటుమందుకు ఎంత పబ్లిసిటీ వచ్చిందో అందరికీ తెలిసిందే. ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్లు కూడా ఆయన మందుకోసం పరుగులు పెట్టారు. ఐతే ఆనందయ్యలాగే మరికొందరు కూడా కరోనాకు మందు ఇస్తున్నారు. కృష్ణపట్నం తరహాలోనే రాజమండ్రిలోనూ ఓ వ్యక్తి మందును పంపిణీ చేశారు. ఇప్పుడు తెలంగాణలోనూ అలాంటి ముందునే ఇస్తున్నారు ఓ సింగరేణి రిటైర్డ్ కార్మికుడు.

మంచిర్యాల జిల్లా మందమర్రి గ్రామానికి చెందిన బచ్చలి భీమయ్య అనే వ్యక్తి కోవిడ్‌కు నాటుమందు ఇస్తున్నాడని తెలియడంతో జనం నెమ్మదిగా అక్కడికి చేరుకుంటున్నారు.  ఆయన పూర్వీకులు కూడా ఇలాంటి మందులు తయారుచేసి స్థానికులకు వైద్యం చేసేవారు. వారి నుంచి వైద్యం నేర్చుకున్న భీమయ్య.. ఇప్పుడు కరోనాకు కూడా మందు తయారు చేస్తున్నాడు. ఆనందయ్యకు తీసిపోని విధంగా కోవిడ్ వచ్చిన వారికి ఉచితంగా వైద్యం చేస్తున్నారు.

ఇప్పటి వరకు చాలా మందికి నయం చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆనందయ్య లాగే బచ్చలి భీమయ్య వైద్యం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  దీంతో ఈ సంగతి తెలుసుకున్న మందమర్రి పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకొని.. విచారణ చెపట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండానే ఏ విధంగా మందును పంపిణీ చేస్తున్నారంటూ ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. మందును ఇవ్వకూడదని స్పష్టం చేశారు. ఇలాంటి మందుతో రిస్క్ తీసుకోవద్దని అక్కడికి వస్తున్నవారిని పోలీసులు హెచ్చరించారు.

ఐతే భీమయ్య మందు పంపిణీకి అనుమతి ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వం అనుమతిస్తే కరోనా పేషెంట్లకు వైద్యాన్ని అందిస్తానని భీమయ్య కూడా చెబుతున్నారు. కాగా, గత 20 ఏళ్లుగా మందమర్రి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ప్రతి ఆదివారం తనకు తెలిసిన వైద్యం అందిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి: Antibody Cocktail: యాంటీబాడీ కాక్‌టెయిల్‌ ట్రయల్స్‌కు అనుమతివ్వండి.. డీసీజీఐకు.. జైడస్‌ క్యాడిలా దరఖాస్తు

ఆనందయ్య మందును రహస్యంగా తయారు చేయించుకుంటారా.. ఇదెక్కడి న్యాయం అంటూ ప్రశ్నించిన సోమిరెడ్డి