Antibody Cocktail: యాంటీబాడీ కాక్‌టెయిల్ ట్రయల్స్‌కు అనుమతివ్వండి.. డీసీజీఐకు.. జైడస్ క్యాడిలా దరఖాస్తు
Covid-19 antibody cocktail: భారత్‌లో కోవిడ్-19 డ్రగ్.. మోనోక్లోనల్ యాంటీబాడీస్ కాక్‌టెయిల్ క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతివ్వాలని కోరుతూ.. ఫార్మా కంపెనీ
Covid-19 antibody cocktail: భారత్‌లో కోవిడ్-19 డ్రగ్.. మోనోక్లోనల్ యాంటీబాడీస్ కాక్‌టెయిల్ క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతివ్వాలని కోరుతూ.. ఫార్మా కంపెనీ జైడస్ క్యాడిలా కోరింది. ఈ మేరకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) కు జైడస్ క్యాడిలా దరఖాస్తు చేసింది. దీంతోపాటు అభివృద్ధి చేసిన మోనోక్లోనల్ కాక్‌టెయిల్‌కు జైడస్ క్యాడిలా ZRC-3308 అనే పేరును కూడా పెట్టింది. తేలికపాటి లక్షణాలున్న కేసుల్లో కాక్‌టెయిల్ ప్రధాన చికిత్సల్లో ఒకటిగా మారుతుందని కంపెనీ వెల్లడించింది. తేలికపాటి కరోనా లక్షణాలతో బాధపడేవారికి దీంతో మంచి ఫలితాలు వస్తున్నాయంటూ వివరించింది. యూఎస్, యూరప్‌లో నిర్వహించిన పరిశోధనల్లో తేలికపాటి లక్షణాలున్న రోగుల్లో వైరల్ లోడ్ తగ్గిందని.. ఆసుపత్రికి వెళ్లే కేసులను ఈ ఔషధం గణనీయంగా తగ్గించేలా చేస్తుందని పేర్కొంది.
ఇప్పటికే రోచ్ కంపెనీ తయారు చేసిన కాక్‌టెయిల్‌కు భారతదేశంలో అత్యవసర వినియోగానికి ఇటీవల డీసీజీఐ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఇది కూడా మంచి ప్రభావం చూపుతోందని గురుగ్రాంలోని మేదాంత ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. కరోనాతో బాధపడుతున్న 84 ఏళ్ల వృద్ధుడికి ఈ కాక్‌టెయిల్ అందించగా అత్యధిక ప్రభావం చూపిందని వెల్లడించారు. కాగా.. మోనోక్లోనల్ యాంటీబాడీ ఆధారిత కాక్‌టెయిల్‌ను అభివృద్ధి చేసిన ఏకైక భారతీయ సంస్థగా జైడస్ నిలిచింది.
SARSCoV-2 స్పైక్ ప్రోటీన్‌ను మోనోక్లోనల్ యాంటీబాడీస్ కాక్‌టెయిల్ నిర్వీర్యం చేస్తుందని తెలిపింది. ఈ సందర్భంగా జైడస్ క్యాడిలా హెల్త్‌కేర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ షార్విల్ పటేల్ మాట్లాడారు. ఈ సమయంలో వైరస్‌పై పోరాడేందుకు సురక్షితమైన, సమర్థవంతమైన చికిత్సలను అన్వేషించాల్సిన అవసరం ఉందని తెలిపారు. కొవిడ్ రోగుల బాధను తగ్గించే సామర్థ్యం ZRC-3308కు ఉందని నమ్మతున్నట్లు పటేల్ పేర్కొన్నారు.
Also Read: