Children Covid Ward: మొట్ట మొదటి చిన్నపిల్లల కరోనా సంరక్షణ కేంద్రం.. ఖమ్మంలో ప్రారంభించిన మంత్రి పువ్వాడ ఆజయ్
రాష్ట్రంలోనే మొదటి పిల్లల కోవిడ్ ఆసుపత్రిని ఖమ్మంలో ప్రారంభించారు. ఆసుపత్రిలో మొత్తం 40 బెడ్స్‌తో పాటు 35 వెంటిలేటర్లను సమకూర్చారు.
First Children Covid Hospital: కరోనా ఉధృతిలో థర్డ్ వేవ్ కూడా ఉంటున్నందన్న నిపుణుల హెచ్చరికలతో రాష్ట్ర సర్కార్ అప్రమత్తమైంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలు చెపట్టారు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఇందుకోసం రాష్ట్రంలోనే మొదటి పిల్లల కోవిడ్ ఆసుపత్రిని ఖమ్మంలో ప్రారంభించారు. ఆసుపత్రిలో మొత్తం 40 బెడ్స్‌తో పాటు 35 వెంటిలేటర్లను సమకూర్చారు.
రాష్ట్రంలోనే తొలిసారిగా ఖమ్మంలో పిల్లల కోసం ప్రత్యేక కరోనా వార్డును ఏర్పాటు చేశామని మంత్రి ఆజయ్ కుమార్ తెలిపారు. ఖమ్మం ప్రభుత్వ ప్రధాన వైద్యశాల పరిధిలోని మాతాశిశు సంరక్షణ కేంద్రంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కొవిడ్ కేర్ సెంటర్ బుధవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. కలెక్టర్ ఆర్వీ కర్ణన్‌తో కలిసి మంత్రి ఆజయ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం పువ్వాడ మాట్లాడుతూ.. థర్డ్‌వేవ్ ప్రభావం చిన్నారులపై ఉన్నదని వైద్య నిఫుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో 40 పడకల వార్డు ఏర్పాటుచేశామని చెప్పారు. 12 ఏండ్ల లోపు పిల్లలకు కరోనా సోకితే ఇక్కడ ఉచితంగా వైద్యం చేస్తామని పేర్కొన్నారు.
యావత్ తెలంగాణలోనే ఇది మొట్టమొదటి చిల్ట్రన్ కొవిడ్ కేంద్రమని మంత్రి పేర్కొన్నారు. గడచిన తొలి దశ, ప్రస్తుత రెండవ దశలో కోవిడ్ ను సమర్ధవంతంగా ఎదుర్కోగలిగామని, అయితే 3వ దశను ముందస్తుగానే ఊహించి వైరస్ ను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా 40బెడ్స్ తో వెంటిలేటర్, ICU, SICU లతో పాటు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
Read Also…. AP High Court: హైకోర్టు మెట్టెక్కిన ఆనందయ్య మందు వ్యవహారం.. పూర్తి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర సర్కార్‌కు ఆదేశం