కారుణ్య ఉద్యోగం కోసం కన్న తండ్రినే చంపేశారు
ఇంకెక్కడి విలువలు, ఇంకెక్కడి మానవ సంబంధాలు. మున్ముందు ఎవరైనా వ్యక్తులు విలువలు పాటిస్తూ కనిపిస్తే..వారిని సెలబ్రిటీలుగా భావించి ఫోటోలు దిగే రోజులు వస్తాయని అనిపిస్తుంది.
ఇంకెక్కడి విలువలు, ఇంకెక్కడి మానవ సంబంధాలు. మున్ముందు ఎవరైనా వ్యక్తులు విలువలు పాటిస్తూ కనిపిస్తే..వారిని సెలబ్రిటీలుగా భావించి ఫోటోలు దిగే రోజులు వస్తాయని అనిపిస్తుంది. సమాజం అంతా స్వార్థం, నెగిటివిటీతో నిండిపోయింది. అయినవారు అని కూడా లేదు. చాలామంది అవసరాల కోసం అడ్డదార్లు తొక్కే పాత్రదారులే. ఇప్పుడు చెప్పబోయే ఘటన వింటే మీరు ఈ వాదనతో ఏకీభవిస్తారు.
కారుణ్య ఉద్యోగం కోసం ఇంటిపెద్దనే హతమార్చారు కుటుంబ సభ్యులు. మళ్లీ ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లుగా కలరింగ్ ఇచ్చారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఈ దారుణ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..పాతబెల్లంపల్లికి చెందిన సింగరేణి కార్మికుడు ముత్తెశంకర్ (57) కుటుంబ సభ్యులతో గొడవల నేపథ్యంలో మూడునెలలుగా ఇంటికి దూరంగా మంచిర్యాలలో ఉంటున్నారు. చిన్నకుమార్తె స్వాతికి కోవిడ్ సోకినట్లు, కుమారుడు శ్రావణ్‌కుమార్‌కు సింటమ్స్ ఉన్నాయని ముత్తెశంకర్‌కు ఆయన భార్య విజయ గురువారం ఫోన్ చేసి చెప్పారు. దీంతో బిడ్డల ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు ఆయన శుక్రవారం సొంతూరుకు వచ్చారు. అదేరోజు రాత్రి నిద్రిస్తున్న సమయంలో భార్య, కుమార్తె, కుమారుడు కలిసి ఆయన గొంతుకు వైరుబిగించి దారుణంగా హత్య చేశారు. ఆత్మహత్యగా చిత్రీకరించడానికి మృతుడి మెడకు చీరను కట్టారు. కారుణ్య నియామకంతో జాబ్ సాధించవచ్చని హత్యచేసి సూసైడ్‌గా చిత్రీకరించడానికి ప్రయత్నాలు చేశారని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ముత్తెశంకర్ చెల్లెలు రుక్మిణి ఫిర్యాదు మేరకు మృతుడి భార్య, కుమార్తె, కుమారుడుపై కేసు నమోదు చేశారు పోలీసులు.
Also Read :
జగన్‌పై దాడి కేసు: హైకోర్టును ఆశ్రయించిన నిందితుడు శ్రీనివాసరావు