Viral Video: దాబాలో భోజనం చేస్తున్న ఓ వక్తి.. ఆకలితో వచ్చిన పక్షి .. అతను చేసిన పనికి నెటిజన్లు ఫిదా

Viral Video: మానవుడు జంతువులను , పక్షులను మచ్చిక చేసుకుని పెంచుకోవడం తెలిసిందే.. కొంతమంది ఐతే.. పక్షులను, కుక్క పిల్లి వంటి జంతువులను తమ సొంత...

Viral Video:  దాబాలో భోజనం చేస్తున్న ఓ వక్తి.. ఆకలితో వచ్చిన పక్షి .. అతను చేసిన పనికి నెటిజన్లు ఫిదా
Viral Vedio
Follow us
Surya Kala

|

Updated on: Jun 17, 2021 | 6:41 AM

Viral Video: మానవుడు జంతువులను , పక్షులను మచ్చిక చేసుకుని పెంచుకోవడం తెలిసిందే.. కొంతమంది ఐతే.. పక్షులను, కుక్క పిల్లి వంటి జంతువులను తమ సొంత ఇంటి పిల్లల్లా ఫీల్ అవుతారు. వాటికీ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించడం.. ఆస్తులు రాసి ఇవ్వడం అనే వార్తలను చూస్తూనే ఉన్నాం.. తమ పెంపుడు జంతువులకు ఇష్టమైన ఆహారం పెట్టడం.. అవి తింటుంటే వీడియో తీసి సోషల్ మీడియా లో ఆ వీడియో పోస్ట్ చేయడం సర్వసాధారణంగా మారిపోయింది. మరి తాజాగా ఓ వీడియో లో ఓ వ్యక్తి భోజనం తింటున్న సమయంలో ఓ పక్షి వాలింది. అతనితో కలిసి అదే ప్లేట్ లో కలిసి ఆహారం తిన్నది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయ్యింది.

మేఘరాజ్‌ దేశాలే అనే వ్యక్తి తన ఇన్‌స్టా గ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఒక వ్యక్తి ఆకలి వేసి. ఒక హోటల్ లో భోజనం చేస్తున్నారు. అదే సమయంలో ఎక్కడ నుంచి వస్తుందో ఒక పక్షి వచ్చి ఆటను తింటున్న ప్లేస్ లోకి వచ్చింది. అతనికి ఎదురుగా నిల్చుని అతను తింటున్న ప్లేట్ లో ఉన్న ఆహారాన్ని దర్జాగా భయం లేకుండా తినడం మొదలు పెట్టింది. అతను ఆ పక్షిని తినకుండా అదిలించన కుండా అది తినడానికి తన ప్లేస్ నుంచి కొంత ఆహారం తీసి బల్ల మీద వేశాడు.. అది తిన్న తర్వాత మళ్ళీ అతని తినే ప్లేట్ పై దండయాత్ర చేసింది. ఎంత ఆకలిగా ఉందొ. అతను తినే ప్లేట్ లోని ఆహార పదార్ధాలను ఇష్టంగా తినడం మొదలు పెట్టింది. ఇద్దరూ కలిసి ఒకే ప్లేట్ భోజనం చేశారు.ఈ సంఘటన ఎప్పుడు ఎక్కడ జరిగిందో తెలియదు కానీ పక్షి, మనిషి కలిసి భోజనం చేస్తున్న సమయంలో తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Also Read: రూపం మార్చుకున్న కరోనా వైరస్.. మాస్కోలో కొత్త వేరియంట్.. సూత్నిక్ పనిచేస్తుందా లేదా అనే ఆందోళన