తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

Tested Positive for Corona : తెలంగాణ కరోనా మహమ్మారి తగ్గినట్లే తగ్గి విజృంభణ కొనసాగిస్తోంది. సామాన్యులతోపాటు ప్రజాప్రతినిధులు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా, మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కరోనా బారినపడ్డారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. కాగా, ఇటీవల ఆయన తన కుమారుడి ఎంగేజ్మెంట్ వేడుకలో పాల్గొన్నారు. ఆ వేడుకలోనే ఆయనకు కరోనా సోకి ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే మైనంపల్లి తన […]

  • Sanjay Kasula
  • Publish Date - 5:15 pm, Tue, 3 November 20
తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

Tested Positive for Corona : తెలంగాణ కరోనా మహమ్మారి తగ్గినట్లే తగ్గి విజృంభణ కొనసాగిస్తోంది. సామాన్యులతోపాటు ప్రజాప్రతినిధులు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా, మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కరోనా బారినపడ్డారు.

టీఆర్ఎస్ పార్టీకి చెందిన మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. కాగా, ఇటీవల ఆయన తన కుమారుడి ఎంగేజ్మెంట్ వేడుకలో పాల్గొన్నారు. ఆ వేడుకలోనే ఆయనకు కరోనా సోకి ఉండవచ్చని భావిస్తున్నారు.

ప్రస్తుతం ఎమ్మెల్యే మైనంపల్లి తన నివాసంలోనే హోంక్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. కాగా, మైనంపల్లి పలువురు ప్రముఖులను కలిసినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయనను కలిసిన వారికి కూడా కరోనా టెన్షన్ పట్టుకుంది. ఈ క్రమంలో తనను కలిసినవారు విధిగా పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్యే మైనంపల్లి కోరారు. వారంతా హోంక్వారంటైన్లో ఉండాలని సూచించారు.