బిగ్ బ్రేకింగ్ : మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన..

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏ పార్టీ కూడా స్పష్టమైన ఆధిక్యాన్ని నిరూపించుకోలేని నేపథ్యంలో.. ఈ చర్య తీసుకోవాలంటూ గవర్నర్ పంపిన సిపార్సుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందుకు రాష్ట్రపతి కూడా ఆమోదముద్ర వేశారు.  కాగా ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీకి ఇచ్చిన గడువు..ఈ రోజు సాయంత్రం 8 గంటల 30 నిమిషాల వరకు ఉంది. ఈ లోపులోనే కేంద్రం తీసుకున్న నిర్ణయం మహారాష్ట్రలోని కీలక పార్టీలకు షాక్ ఇచ్చింది. […]

బిగ్ బ్రేకింగ్ : మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన..
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 12, 2019 | 6:21 PM

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏ పార్టీ కూడా స్పష్టమైన ఆధిక్యాన్ని నిరూపించుకోలేని నేపథ్యంలో.. ఈ చర్య తీసుకోవాలంటూ గవర్నర్ పంపిన సిపార్సుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందుకు రాష్ట్రపతి కూడా ఆమోదముద్ర వేశారు.  కాగా ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీకి ఇచ్చిన గడువు..ఈ రోజు సాయంత్రం 8 గంటల 30 నిమిషాల వరకు ఉంది. ఈ లోపులోనే కేంద్రం తీసుకున్న నిర్ణయం మహారాష్ట్రలోని కీలక పార్టీలకు షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో ఎన్సీపీకి విధించిన డెడ్‌లైన్‌లోగానే.. రాష్ట్రపతి పాలన విధించిన పక్షంలో శివసేన సుప్రీంకోర్టుకి ఎక్కే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో ప్రముఖ న్యాయవాది కపిల్ సిబాల్‌ను సంప్రదించాలని నిర్ణయించింది. కేంద్ర కేబినెట్ సమావేశంలో పాల్గొన్న అనంతరం.. ప్రధాని మోదీ బ్రిక్స్ సమావేశానికి హాజరయ్యేందకు బ్రెజిల్ బయలుదేరి వెళ్లారు.