AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దానికి దూరంగా ఉంటూ ఎంత ప్రశాంతంగా ఉన్నానో..!

దాదాపు ఐదేళ్లుగా ఏఐసీసీ సోషల్ మీడియా విభాగంలో కీలకంగా వ్యవహరించిన నటి రమ్య అలియాస్ దివ్య స్పందన.. ఆ మధ్యన తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే అంతకంటే ముందే తన సొంత సోషల్ మీడియా అకౌంట్‌ను కూడా ఆమె డిలీట్ చేశారు. ఇలా మొత్తానికి ఆమె సోషల్ మీడియాకు దూరం అవ్వడంతో ‘రమ్యా ఎల్లిదియమ్మా’ అనే హ్యాష్‌ట్యాగ్ అప్పట్లో బాగా ట్రెండ్ అయ్యింది. కాగా వీటన్నింటికి తాజాగా సమాధానం ఇచ్చారు రమ్య. సోషల్ […]

దానికి దూరంగా ఉంటూ ఎంత ప్రశాంతంగా ఉన్నానో..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 12, 2019 | 2:12 PM

Share

దాదాపు ఐదేళ్లుగా ఏఐసీసీ సోషల్ మీడియా విభాగంలో కీలకంగా వ్యవహరించిన నటి రమ్య అలియాస్ దివ్య స్పందన.. ఆ మధ్యన తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే అంతకంటే ముందే తన సొంత సోషల్ మీడియా అకౌంట్‌ను కూడా ఆమె డిలీట్ చేశారు. ఇలా మొత్తానికి ఆమె సోషల్ మీడియాకు దూరం అవ్వడంతో ‘రమ్యా ఎల్లిదియమ్మా’ అనే హ్యాష్‌ట్యాగ్ అప్పట్లో బాగా ట్రెండ్ అయ్యింది. కాగా వీటన్నింటికి తాజాగా సమాధానం ఇచ్చారు రమ్య. సోషల్ మీడియా హెడ్‌గా రాహుల్ గాంధీ తనను నియమించినప్పుడు తానేం పెద్ద అనౌన్స్‌మెంట్ చేయలేదని గుర్తుచేసిన రమ్య.. ఆ బాధ్యతల నుంచి తప్పుకున్న తరువాత కూడా అలాగే ఉన్నానని తెలిపారు. ఈ సందర్భంగా పెళ్లి వార్తలపై కూడా ఆమె క్లారిటీ ఇచ్చారు.

తాను దుబాయ్‌లో వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయని.. దీనిపై ఎందుకు హైప్‌ వచ్చిందో కూడా తనకు అర్థం కాలేదని ఆమె వాపోయారు. కొన్ని రోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటుండటంతో.. ఆ ఫ్లాట్‌ఫాంలో ఏం జరుగుతుందో కూడా తనకు తెలీదని చెప్పుకొచ్చారు. ఇక సినిమా ఆఫర్లు కూడా తనకు వస్తున్నాయని.. కానీ రాజకీయంగా కొన్ని కమిట్‌మెంట్లు ఉండటం వలన ఏ సినిమాకు ఇంతవరకు ఓకే చెప్పలేదని ఆమె తెలిపారు. అయితే వెంటనే.. సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆమె పేర్కొనడం విశేషం. ఇక జీవితంలో మీ తదుపరి స్టెప్ ఏంటని అడిగిన ప్రశ్నకు.. ‘‘మొదట్లో సినిమాలంటే నాకు చాలా ఇష్టంగా ఉండేది. అందుకే వాటిలో నటించాను. ఆ తరువాత రాజకీయాలపై ఆసక్తి రావడంతో అటుగా వెళ్లాను. ఇక భవిష్యత్‌లో నాకు దేనిపైనైనా ఆసక్తి వస్తే అది కచ్చితంగా చేస్తాను. ఇప్పుడైతే సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ చాలా సంతోషంగా ఉన్నాను’’ అని రమ్య స్పష్టం చేశారు.

కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రాంకు పార్సిల్
కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రాంకు పార్సిల్
మన శంకరవరప్రసాద్ గారు సినిమా పబ్లిక్ టాక్..
మన శంకరవరప్రసాద్ గారు సినిమా పబ్లిక్ టాక్..
ఆపరేషన్‌ 2.0.. ఆ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణపై జనసేక ఫోకస్
ఆపరేషన్‌ 2.0.. ఆ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణపై జనసేక ఫోకస్
ఆర్డర్ చేయకుండానే ఇంటికొచ్చిన పార్శిల్.. ఓపెన్ చేసి..
ఆర్డర్ చేయకుండానే ఇంటికొచ్చిన పార్శిల్.. ఓపెన్ చేసి..
ఈ ట్రైన్‌లో వెయిటింగ్ సౌకర్యం ఉండదు.. కనీస ఛార్జ్‌ ఎంత ఉంతంటే..
ఈ ట్రైన్‌లో వెయిటింగ్ సౌకర్యం ఉండదు.. కనీస ఛార్జ్‌ ఎంత ఉంతంటే..
మకరజ్యోతి దర్శనానికి సర్వం సిద్ధం.. కేవలం వారికి మాత్రమే అనుమతి
మకరజ్యోతి దర్శనానికి సర్వం సిద్ధం.. కేవలం వారికి మాత్రమే అనుమతి
ఒకే మ్యాచ్‌లో 414 పరుగులు..ఢిల్లీ కోటను కూల్చిన సోఫీ
ఒకే మ్యాచ్‌లో 414 పరుగులు..ఢిల్లీ కోటను కూల్చిన సోఫీ
విద్యార్థులకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్
విద్యార్థులకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్
7 వైడ్లు, 4 నోబాల్స్.! పిల్లబచ్చా జట్టుపై 17 బంతులు ఓవర్‌..
7 వైడ్లు, 4 నోబాల్స్.! పిల్లబచ్చా జట్టుపై 17 బంతులు ఓవర్‌..
వడోదరలో విరాట్ విధ్వంసం..సెంచరీ మిస్సైనా రికార్డుల పంచ్ అదిరింది
వడోదరలో విరాట్ విధ్వంసం..సెంచరీ మిస్సైనా రికార్డుల పంచ్ అదిరింది