సరిగ్గా నిద్ర పట్టట్లేదా.. రాత్రి పడుకునే ముందు ఇవి తినండి చాలు
06 July 2026
Anand T
శరీరానికి ఎంతో మేలు చేసే సుగంధ ద్రవ్యాలలో యాలకులు కూడా ఒకటి. అయితే రోజూ రాత్రి పడుకునే ముందు వీటిని తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
ఆరోగ్య ప్రయోజనాలు
యాలకులలో ఉండే సహజ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు నోటిలోని బ్యాక్టీరియాను అరికట్టి.. దుర్వాసనను దూరం చేస్తాయి.
దుర్వాసనకు చెక్
యాలకుల సువాసన నోటికి మంచి ఫ్రెష్‌నెస్‌ను ఇస్తుంది. అందుకే రాత్రి భోజనం చేసిన తర్వాత దీనిని నమలడం ఎంతో మంచిది.
తాజాదనం
రాత్రి పూట యాలకులు తినడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి జీర్ణక్రియ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు
జీర్ణక్రియ
గుండెమంటతో బాధపడేవారు రోజు పడుకునే ముందు యాలకులు నమలడం వల్ల మంచి ఆ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు
గుండెమంట
రాత్రి వేళల్లో యాలకులు తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గి, ప్రశాంతమైన నిద్ర పడటానికి సహాయపడుతుంది.
నిద్ర నాణ్యత
యాలకులు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ, కొంతమందిలో ఇవి దుష్ప్రభావాలు కలిగించవచ్చు. కాబట్టి వీటిని క్రమబద్ధంగా డైట్‌లో చేర్చుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.