AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Madras High Court: భర్త బతికుండగానే తాళి తీసేయడం మానసిక క్రూరత్వమే.. మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు

హిందూ సంప్రదాయం ప్రకారం వివాహ వేడుకలో మంగళసూత్రం (Mangalasutra) ఎంతో ముఖ్యమైనది.అంతే కాకుండా పవిత్రమైనది కూడా. పెళ్లిళ్లకు, తాళికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ విషయంలో ఒ జంట మధ్య చెలరేగిన వివాదంలో మద్రాస్....

Madras High Court: భర్త బతికుండగానే తాళి తీసేయడం మానసిక క్రూరత్వమే.. మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు
Madras High Court
Ganesh Mudavath
|

Updated on: Jul 15, 2022 | 4:17 PM

Share

హిందూ సంప్రదాయం ప్రకారం వివాహ వేడుకలో మంగళసూత్రం (Mangalasutra) ఎంతో ముఖ్యమైనది.అంతే కాకుండా పవిత్రమైనది కూడా. పెళ్లిళ్లకు, తాళికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ విషయంలో ఒ జంట మధ్య చెలరేగిన వివాదంలో మద్రాస్ హైకోర్టు (Madras High Court) కీలక వ్యాఖ్యలు చేసింది. భర్త బతికుండగానే తాళిబొట్టు తీసేయడం మానసిక క్రూరత్వం కిందికే వస్తుందని ధర్మాసనం వెల్లడించింది. ఓ విడాకుల కేసు విచారణలో భాగంగా న్యాయమూర్తులు వీఎం వేలుమణి, ఎస్‌.సౌంథర్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ఈ తీర్పు ఇచ్చింది. తమిళనాడులోని ఈరోడ్‌లోని మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సి.శివకుమార్.. తనకు విడాకులు ఇవ్వడాన్ని నిరాకరిస్తూ 2016 జూన్ 15న స్థానిక ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులను రద్దు చేయాలని కోరాడు. కాగా ఆ విచారణ సమయంలో శివకుమార్ భార్య మంగళసూత్రాన్ని తొలగించినట్లు తేలింది. దీనిని తీవ్రంగా పరిగణలోకి తీసుకున్న కోర్టు.. హిందూ వివాహ వేడుకలో తాళి అనేది ఒక ముఖ్యమైన ఆచారమని చెబుతూ శివకుమార్ అప్పీల్‌ను స్వీకరించింది.

తాళి వైవాహిక జీవితానికి ప్రతీక. భర్త మరణించిన తర్వాత మాత్రమే దానిని తొలగించాలి. విడిపోవాలనుకున్న భార్య ముందుగా మంగళసూత్రాలను తీసివేయడమంటే భర్తను మానసిక క్రూరత్వానికి గురి చేసినట్లే. వైవాహిక బంధాన్ని ముగించడానికి తాళిని తొలగిస్తే సరిపోతుందని తాము ఎప్పుడూ చెప్పలేం. వివాహ బంధాన్ని పునరుద్దరించే, కొనసాగించే ఉద్దేశం లేదని కచ్చితమైన నిర్ధారణకు రావడం చాలా ముఖ్యం. సహోద్యోగులు, విద్యార్థులు, పోలీసుల సమక్షంలో భర్తపై వివాహేతర సంబంధం ఆరోపణలు చేశారు. తద్వారా భర్తను భార్య మానసికంగా హింసించింది. భార్య తాళిని తొలగించడం వల్ల భర్తకు మానసిక క్షోభ కలుగుతుంది. ప్రతివాది మనో భావాలను దెబ్బతీసే అవకాశం ఉంది.

      – మద్రాస్ హైకోర్టు

ఇవి కూడా చదవండి

శివకుమార్ భార్య తన తాళిని తొలగించిందని, దానిని బ్యాంకు లాకర్‌లో ఉంచినట్టు స్వయంగా ఒప్పుకుంది. శివకుమార్, అతని భార్య 2011 నుంచి విడివిడిగా జీవిస్తున్నారు. ఈ కాలంలో భార్య మళ్లీ కలవడానికి ప్రయత్నం చేసినట్టుగా ఎటువంటి ఆధారాలు లభించలేదు. అంతేకాకుండా భార్య తన చర్యల ద్వారా భర్తకు మానసిక క్షోభకు గురి చేసింది. ఈ మేరకు వివాహాన్ని రద్దు చేస్తూ దిగువ కోర్టు తీర్పును ఖండిస్తూ పిటిషనర్‌కు విడాకులు మంజూరు చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి