Viral News: మాంసం కోసం హత్యలు.. రష్యా నరమాంస భక్షకుడి షాకింగ్ కథ

సర్వ సాధారణంగా ఒక నేరస్థుడు తాను ఎవరినైనా హత్య చేసే.. ఆ శవాన్ని పారవేసినట్లు వినే ఉంటారు. కానీ ఈ వ్యక్తి భిన్నం.. ఎందుకంటే ఇతను హత్య చేసి.. ఆ మనిషి శవాన్ని పారవేయకుండా వేయించి తిన్నాడు. తాజాగా రష్యాకు చెందిన ఓ నర భక్షుడికి సంబంధించిన షాకింగ్ వ్యవహారం వెలుగుచూసింది.

Viral News: మాంసం కోసం హత్యలు.. రష్యా నరమాంస భక్షకుడి షాకింగ్ కథ
Russian Cannibal Vladimir
Follow us
Surya Kala

|

Updated on: Jul 15, 2022 | 4:39 PM

Viral News: ఎంత కఠినంగా ఉన్నా ప్రపంచంలో నేరాలు తగ్గుముఖం పట్టడం లేదు. ప్రపంచంలో ప్రతిరోజూ లక్షలాది నేరాలు జరుగుతున్నాయి. అవును, కొంత మంది నేరస్థులు పట్టుబడుతుంటే.. మరికొందరు నేరస్థులు తప్పించుకుని సమాజంలో తిరుగుతూనే ఉన్నారు. దొంగతనం, అత్యాచారం, హత్య వంటి ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అయితే కొన్ని నేరాల సంబంధించిన విషయాలు తెలిస్తే.. ఇటువంటి నేరస్థులు కూడా ఉన్నారా అంటూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ రోజు మనం అలాంటి ఒక కేసు గురించి తెలుసుకుందాం. ఈ నేరస్థుడు, కేసు చాలా భయానకంగా ఉంది.. వింతగా అనిపిస్తాది.సర్వ సాధారణంగా ఒక నేరస్థుడు తాను ఎవరినైనా హత్య చేసే.. ఆ శవాన్ని పారవేసినట్లు వినే ఉంటారు. కానీ ఈ వ్యక్తి భిన్నం.. ఎందుకంటే ఇతను హత్య చేసి.. ఆ మనిషి శవాన్ని పారవేయకుండా వేయించి తిన్నాడు. రష్యాకు చెందిన ఓ నర భక్షుడికి సంబంధించిన షాకింగ్ వ్యవహారం వెలుగుచూసింది. అవును చేసిన నేరాలు రుజువు కావడంతో 1997లో కోర్టు మరణశిక్ష విధించిన వ్లాదిమిర్ నికోలాయెవిచ్ నికోలయేవ్ అనే రష్యన్ నివాసి కథ ఇది. ఇద్దరు వ్యక్తులను చంపి వారి మాంసాన్ని వండి తిన్నాడనే ఆరోపణలు వినిపించాయి. అయితే, 1999 సంవత్సరంలో ఈ భయంకరమైన నరమాంస భక్షకుడు మరణశిక్ష నుండి విముక్తి పొందాడు. అతని శిక్ష జీవిత ఖైదుగా మార్చబడింది. అప్పటి నుండి ఈ నేరస్థుడు జైలులో ఉన్నాడు.

డైలీ మెయిల్ యొక్క నివేదిక ప్రకారం, నరమాంస భక్షకుడు వ్లాదిమిర్ తన నేరాన్ని అంగీకరించినప్పుడు అందరూ షాక్ అయ్యారు. తాను మొదటిసారిగా మానవ మాంసాన్ని ఉడకబెట్టి తిన్నానని, అయితే తనకు ఆ రుచి నచ్చలేదని.. అందుకనే మరో వ్యక్తిని హత్య చేసి తనకు నచ్చినట్లుగా ఆ మనిషి మాంసాన్ని వేయించుకుని తిన్నానని చెప్పాడు.

శవాన్ని పారవేసేటప్పుడు మానవ మాంసాన్ని తినాలనే ఆలోచన వచ్చింది మీడియా నివేదికల ప్రకారం.. వ్లాదిమిర్ సామాన్యమైన వ్యక్తి.. వృత్తి.. రచనలు చేయడం.. అయితే ఒకసారి లైటర్ కోసం ఒక వ్యక్తితో గొడవ పడినప్పుడు మొదటి హత్య చేసినట్లు పోలీసుల విచారంలో తెలిపాడు. ఆవేశంలో వ్లాదిమిర్ హత్య చేశాడు.. కానీ శవాన్ని ఎలా మాయం చేయాలనీ ఆలోచిస్తున్న సమయంలో మొదటి సారిగా తన మనసులో మనిషి మాంసం ఎందుకు తినకూడదు అనే ఆలోచన వచ్చిందని చెప్పాడు. వెంటనే తన ఆలోచనని అమల్లోకి పెట్టి.. మనిషి మాంసాన్ని ఉడికించి తిన్నట్లు చెప్పి.. అందరికి షాక్ ఇచ్చాడు. అయితే తనకు ఉడికించిన మాంసం రుచి నచ్చలేదని తెలిపాడు.

ఇవి కూడా చదవండి

రెండవసారి వేయించి మానవ మాంసాన్ని తిన్నాడు తాను రెండవ సారి హత్య చేసినప్పుడు..  మనిషి మాంసాన్ని వేయించి.. తిన్నట్లు తెలిపాడు వ్లాదిమిర్. అంతేకాదు తాను వేయించిన ఈ మాంసాన్ని తన పిల్లలకు కూడా తినడానికి పెట్టినట్లు తెలిపాడు. తరువాత అతను పోలీసులకు పట్టుబడ్డాడు. విచారణలో నేరం అంగీకరించడంతో కోర్టు ముందుగా మరణశిక్ష విధించింది.. తర్వాత ఆ శిక్షను జీవిత ఖైదుగా మార్చింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..