Hyderabad: మాయగాడు.. 60 మంది అమ్మాయిలను ట్రాప్ చేశాడు.. విచారణలో మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు..
ఒకరు కాదు, ఇద్దరు ఏకంగా 60 మంది అమ్మాయిలను మోసం చేశాడు ఈ మాయగాడు. అమెరికాలో ఉండే ఓ అమ్మాయి ఫిర్యాదుతో ఇతగాడి తీగ లాగితే డొంకంతా కదిలింది. ఆ వివరాలు...
Instagram Cheating: ఇన్‌స్టాలో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి.. తాను హైప్రొఫైల్ వ్యక్తి మాదిరిగా కలరింగ్ ఇచ్చి.. అమ్మాయిలకు రిక్వెస్ట్ పెడతాడు. వారు గాని యాక్సెప్ట్ చేశారో అతడి వలలో పడ్డట్లే. స్వీట్‌గా చాటింగ్‌లోకి దింపుతాడు. ఆపై రోజురోజుకు నమ్మకం పెరిగేలా చేస్తాడు. ఆ అమ్మాయి తనను బాగా నమ్మిందని ఫిక్స్ అయ్యాక.. తన చాలా ఎమర్జెన్సీ ఉందని మనీ అడుగుతాడు. అలా కుదిరినంత దోచేస్తాడు. అతడి ట్రాప్‌లో పడ్డ చాలామంది అమ్మాయిలు అడిగినంత ఇచ్చేశారు. కొందరు బయటకు చెబితే పరువు పోతుందని సైలెంట్ అయిపోయారు. తాజాగా ఇతడు పోలీసులకు చిక్కాడు. ఎంక్వైరీ చేస్తే మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు తెలిశాయి. గురుడు ఇలా 60 మంది అమ్మాయిలను ముంచేశాడు. దాదాపు రూ.4 కోట్లకు పైగా లూటీ చేశాడు. చాటింగ్‌లో పట్టు సాధించి.. ఇన్ స్టానే అస్త్రంగా చేసుకుని.. మోసాలతో చెలరేగిపోయాడు. అమెరికా(America) వరకు వెళ్లింది ఇతగాడి బాగోతం. లక్షలు మోసపోయిన అమెరికాలో ఉండే హైదరాబాద్‌కు చెందిన ఓ బాధిత యువతి… సైబర్ క్రైం పోలీసులకు కంప్లైంట్ చేయండంతో.. అతడు పోలీసుల రాడార్‌లోకి వచ్చాడు. అతనపై పోకస్ పెట్టిన పోలీసులు.. ట్రాక్ చేసి.. అదుపులోకి తీసుకున్నారు. అతడిని ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని రాజమండ్రికి చెందిన వంశీకృష్ణగా గుర్తించారు. ఈ హైటెక్ బాబు.. బీటెక్ కూడా పూర్తి చేశాడు. వంశీకృష్ణపై గతంలో ఉభయ గోదావరి, కాకినాడ, భీమవరం, విశాఖపట్నం, విజయవాడ, రాచకొండ, ఖమ్మం, గద్వాల, నిజామాబాద్, కరీంనగర్‌లో ఈ తరహా పలు కేసులు నమోదయ్యాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..