Telangana: సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం పక్కా.. మీడియాతో చిట్‌చాట్‌లో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

కేంద్రప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ (KTR) మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన దానికంటే.. కేంద్రానికి రాష్ట్రం ఎక్కువ ఇచ్చిందని వెల్లడించారు. ఇది తప్పని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు.ఎనిమిదేళ్ల....

Telangana: సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం పక్కా.. మీడియాతో చిట్‌చాట్‌లో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Follow us
Ganesh Mudavath

| Edited By: Janardhan Veluru

Updated on: Jul 15, 2022 | 3:18 PM

కేంద్రప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ (KTR) మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన దానికంటే.. కేంద్రానికి రాష్ట్రం ఎక్కువ ఇచ్చిందని వెల్లడించారు. ఇది తప్పని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు. ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ పాలనపై ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందని చెప్పుకొచ్చారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా (KCR) హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ సర్వేలే ఈ విషయాన్ని బహిర్గతం చేస్తున్నాయని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ 90కి పైగా స్థానాల్లో గెలుస్తుందని తమ సర్వేల్లో తేలిందని చెప్పారు. ముందస్తు ఎన్నికల యోచన లేదని స్పష్టంచేసిన కేటీఆర్.. షెడ్యూల్ మేరకు 2023లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయన్నారు.

శత్రు దేశాలపై ఆర్థిక ఆంక్షలు పెట్టినట్లు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పై వ్యవహరిస్తుందోని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఎవరికీ లొంగరు, బెదరరని అన్నారు. రాబోయే మూడు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఒడిపోతుందని జోస్యం చెప్పారు. సిరిసిల్ల కు వస్తున్న కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీకి స్వాగతం చెప్పిన మంత్రి కేటీఆర్.. సిరిసిల్ల అభివృద్ధిని చూసి నేర్చుకోవాలని సూచించారు. సిరిసిల్ల తరహా అభివృద్ధి చేసి రాహుల్ గాంధీ మళ్లీ అమేథీ లో గెలవాలన్నారు. హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌లో మంత్రి కేటీఆర్ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు, పెన్షలు జారీ చేస్తామన్న కేటీఆర్.. ఈ విషయంలో త్వరలోనే సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఉద్యోగుల జీతాలను భారీగా పెంచిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. జీతాల చెల్లింపు ఆలస్యం కావడం పెద్ద విషయం కాదని కొట్టిపారేశారు.

ఇవి కూడా చదవండి

ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్‌కు మాత్రమే ప్రధాని అన్నట్లు వ్యవహరించడం సరికాదన్నారు.  తెలంగాణకు ఒక్క రూపాయి వరద సాయం కూడా ఇవ్వలేదని.. అయితే గుజరాత్‌కు వెయ్యి కోట్ల వరద సాయం అడ్వాన్స్‌గా ఇచ్చారని అన్నారు. రాష్ట్రాల మధ్య ఇలా పక్షపాత ధోరణి సరికాదన్నారు. ప్రైవేటు పర్యనటకు వచ్చిన ప్రధానికి సీఎం స్వాగతం పలకాల్సిన అవసరం లేదన్నారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు గుజరాత్ సీఎంగా ఉన్న మోదీ ఆయనకు స్వాగతం పలకలేదని గుర్తుచేశారు.

ఎనిమిదేళ్ల పాలన తర్వాత ప్రజల నుంచి మంచి స్పందన‌ వస్తోంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ కొట్టడం ఖాయం. కాంగ్రెస్, బీజేపీ సర్వేలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ‌టీఆర్ఎస్ పార్టీయే రాష్ట్రం అంతటా ఉంది. ‌90కి పైగా స్థానాలు వస్తాయని మా సర్వే చెబుతోంది. ‌కేసీఆర్ దొర అయితే ఎంత మందిని జైల్లో వేశారు?. మంచి పనులతో మనసులు గెలవడం బీజేపీకి తెలియదు. ‌కేసీఆర్ ఎవరికీ బెదరరు, లొంగరు.

     – కేటీఆర్‌, తెలంగాణ మంత్రి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!