ఇది కదా గొప్ప మనస్సు.. ఆర్భాటం లేదు.. హంగామా లేదు.. 51,000 కుక్కల ఆకలి తీర్చిన బర్త్‌డే వేడుక..!
మానవత్వానికి, మూగజీవాల పట్ల ప్రేమకు అద్దం పట్టే ఒక అద్భుతమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆడంబరాలకు పోకుండా, ఆకలితో ఉన్న వీధి కుక్కల కడుపు నింపి ఔదార్యం చాటుకున్నారు. ఒకటి కాదు రెండు 50 వేలకు పైగా మూగజీవాల ఆకలి తీర్చారు. తన 55వ పుట్టినరోజును శివసేన పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జ్ సురేష్ గుర్జర్ అత్యంత అర్థవంతంగా జరుపుకున్నారు.

మానవత్వానికి, మూగజీవాల పట్ల ప్రేమకు అద్దం పట్టే ఒక అద్భుతమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆడంబరాలకు పోకుండా, ఆకలితో ఉన్న వీధి కుక్కల కడుపు నింపి ఔదార్యం చాటుకున్నారు. ఒకటి కాదు రెండు 50 వేలకు పైగా మూగజీవాల ఆకలి తీర్చారు. తన 55వ పుట్టినరోజును శివసేన పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జ్ సురేష్ గుర్జర్ అత్యంత అర్థవంతంగా జరుపుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో జరిగింది ఈ ఘటన.
సాధారణంగా పుట్టినరోజు అంటే విందులు, వినోదాలు, కేక్ కటింగ్ వంటివి ఉంటాయి. కానీ సురేష్ గుర్జర్ వీటన్నింటికీ భిన్నంగా, నగరంలోని 51,000 వీధి కుక్కలకు సామూహిక విందు ఏర్పాటు చేశారు. తన వాహనంలో పాలు, బిస్కెట్లు, టోస్ట్‌లు, ఇతర ఆహార పదార్థాలను నింపుకుని నగరం అంతా కలియతిరుగుతూ వాటి ఆకలి తీర్చారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆయన కారు హారన్ వినగానే వీధి కుక్కలన్నీ ఎంతో ఆత్మీయంగా ఆయన వద్దకు పరుగెత్తుకు రావడం అక్కడి వారిని ఆశ్చర్యపరిచింది.
ఈ సందర్భంగా సురేష్ గుర్జర్ తన జీవితంలోని చీకటి రోజులను గుర్తుచేసుకున్నారు. ఒకప్పుడు తాను తీవ్రమైన పేదరికాన్ని, అప్పుల ఊబిని అనుభవించానని ఆయన తెలిపారు. మూగ జీవులకు సేవ చేయడం ప్రారంభించిన తర్వాతే తన జీవితంలో సానుకూల మార్పులు మొదలయ్యాయని, తిరిగి ఆర్థికంగా స్థిరపడగలిగానని ఆయన విశ్వసిస్తున్నారు. ప్రస్తుతం ఆయన తన నివాసంలో, వ్యవసాయ క్షేత్రంలో అనేక కుక్కలను పెంచుకుంటూ వాటిని కన్నబిడ్డల్లా చూసుకుంటున్నారు.
నగరాల్లో వీధి కుక్కలను చూస్తే జనం భయపడటం లేదా వాటిని హింసించడం మనం తరచుగా చూస్తుంటాం. కానీ, గుర్జర్ చేపట్టిన ఈ కార్యక్రమం ప్రజల్లో సానుకూల దృక్పథాన్ని తెలియజేస్తుంది. పెంపుడు జంతువులకు యజమానులు ఉంటారు కానీ, వీధి కుక్కలకు ఎవరూ ఉండరని, అందుకే వాటికి సేవ చేయడమే నిజమైన మానవత్వమని ఆయన చాటిచెప్పారు.
ఈ సేవా కార్యక్రమంలో శివసేన నాయకులు, పలు సామాజిక సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొని గుర్జర్‌ను అభినందించారు. ఈ కార్యక్రమం కేవలం ఒక్క రోజుకే పరిమితం కాదని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఒక రాజకీయ నాయకుడు ఇలాంటి సేవా దృక్పథంతో ముందుకు రావడం అందరినీ ఆలోచింపజేస్తోంది.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
