AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI Jobs 2026: రూ.14 లక్షల జీతంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేదు

దేశంలోని వివిధ ఎస్బీఐ బ్రాంచుల్లో ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న వారికి ఎలాంటి రాత పరీక్ష నిర్వహించకుండానే విద్యార్హతలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా ..

SBI Jobs 2026: రూ.14 లక్షల జీతంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేదు
SBI Lead Business Analyst Recruitment
Srilakshmi C
|

Updated on: Apr 26, 2026 | 6:47 AM

Share

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI).. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచుల్లో ఒప్పంద ప్రాతిపదికన స్పెషలిస్ట్‌ కేడర్‌లో ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీకి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద 8 లీడ్‌ బిజినెస్‌ అనలిస్ట్‌ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు మే 4వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

ఎస్‌బీఐలో స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలకు దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఎస్బీఐలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్‌ లేదా ఎంసీఏ, ఎంటెక్‌/ ఎంఎస్సీ, ఎంబీఏలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత ఉద్యోగానుభవం కూడా ఉండాలి. దరఖాస్తు దారుల వయోపరిమితి మార్చి 31, 2026 నాటికి 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో మే 4, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.750 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్‌ఎస్‌, డీఎక్స్‌ఎస్‌ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. దరఖాస్తు చేసుకున్న వారికి ఎలాంటి రాత పరీక్ష ఉండదు. షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి ఏడాదికి రూ.45 లక్షలు చొప్పున జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు ఈ కింది అధికారిక వెబ్‌సైట్‌ లింక్‌ ద్వారా చెక్‌ చేసుకోండి.

ఎస్‌బీఐలో స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలకు దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us