పాకిస్థాన్ కు మధ్యప్రదేశ్ రైతుల భారీ షాక్

మధ్యప్రదేశ్ : పుల్వామా ఉగ్రదాడి అనంతరం దేశవ్యాప్తంగా పాకిస్తాన్‌పై నిరసన జ్వాలలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా రైతులు కూడా తమదైన శైలిలో పాక్ కు బుద్ధి చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. నిత్యం మధ్యప్రదేశ్ ఝాబువాకు చెందిన రైతులు పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా కఠిన నిర్ణయం తీసుకున్నారు. పాకిస్తాన్‌కు తాము పండించే టమాటాలు పంపించేందుకు నిరాకరించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పాకిస్తాన్ మన దేశ సైనికులను అమానుషంగా అంతమొందించింది. వారికి మన దేశం తగిన బుద్ధి చెప్పాల్సివుంది. దీనిలో భాగంగానే […]

  • Tv9 Telugu
  • Publish Date - 4:29 pm, Tue, 19 February 19
పాకిస్థాన్ కు మధ్యప్రదేశ్ రైతుల భారీ షాక్

మధ్యప్రదేశ్ : పుల్వామా ఉగ్రదాడి అనంతరం దేశవ్యాప్తంగా పాకిస్తాన్‌పై నిరసన జ్వాలలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా రైతులు కూడా తమదైన శైలిలో పాక్ కు బుద్ధి చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. నిత్యం మధ్యప్రదేశ్ ఝాబువాకు చెందిన రైతులు పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా కఠిన నిర్ణయం తీసుకున్నారు. పాకిస్తాన్‌కు తాము పండించే టమాటాలు పంపించేందుకు నిరాకరించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పాకిస్తాన్ మన దేశ సైనికులను అమానుషంగా అంతమొందించింది. వారికి మన దేశం తగిన బుద్ధి చెప్పాల్సివుంది. దీనిలో భాగంగానే మేమంతా పాకిస్తాన్‌కు టమాటాలు పంపించకూడదని నిర్ణయించుకున్నామని తెలిపారు. టమాటాలన్నీకుళ్లిపోయి, పాడయిపోయినా పర్వాలేదు కానీ, పాక్‌కు టమాటాలు పంపేదిలేదని తేల్చిచెప్పారు. ఝాబువా జిల్లాలోని పెట్లావద్ నుంచి పాకిస్తాన్‌కు టమాటాలు ఎగుమతి అవుతుంటాయి. పైగా ఇక్కడి నుంచి వచ్చే టమాటాలకు పాకిస్తాన్‌లో విపరీతమైన డిమాండ్ ఉంది.